Thank you Ticket price: ఏపీ తెలంగాణ‌లో థాంక్యూ టికెట్ ధ‌ర‌లు ఇవే...రివీల్ చేసిన ప్రొడ్యూసర్-naga chaitanya thank you ticket prices in ap and telangana ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Naga Chaitanya Thank You Ticket Prices In Ap And Telangana

Thank you Ticket price: ఏపీ తెలంగాణ‌లో థాంక్యూ టికెట్ ధ‌ర‌లు ఇవే...రివీల్ చేసిన ప్రొడ్యూసర్

Nelki Naresh Kumar HT Telugu
Jul 18, 2022 12:54 PM IST

నాగ‌చైత‌న్య హీరోగా విక్ర‌మ్ కెకుమార్ ద‌ర్శ‌క‌త్వం రూపొందుతున్న థాంక్యూ చిత్రం జూలై 22న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ఏపీ,తెలంగాణ‌లో టికెట్ల ధ‌ర‌లను నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.

నాగ‌చైత‌న్య
నాగ‌చైత‌న్య (twitter)

మనం సక్సెస్ త‌ర్వాత యువ హీరో nel ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె కుమార్ క‌ల‌యిక‌లో రూపొందుతున్న చిత్రం థాంక్యూ. భిన్న‌మైన ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం జూలై 22న ప్రేక్ష‌కుల ముందుకురానుంది. ఓ యువ‌కుడి జీవితంలో వివిధ ద‌శ‌ల్లోసాగిన ప్రేమ‌క‌థ‌ను ఆవిష్కరిస్తూ విక్రమ్ కె కుమార్ సినిమాను రూపొందించారు. జీవితంలో తాను ఉన్న‌త స్థాయికి చేరుకోవ‌డానికి కార‌ణ‌మైన వారికి ఓ యువ‌కుడు ఎలా థాంక్యూ చెప్పార‌నే అంశాన్ని హృద్యంగా ఈ సినిమాలో ఆవిష్క‌రించ‌బోతున్నారు.

థాంక్యూ సినిమాలో మూడు డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ తో కూడిన క్యారెక్ట‌ర్‌లో నాగ‌చైత‌న్య క‌నిపించ‌బోతున్నారు. ఏపీ తెలంగాణలో ఈ సినిమా టికెట్ ధరలు ఎలా ఉండనున్నాయనేది కొంతకాలంగా ఆసక్తికరంగా మారింది. ఈ టికెట్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని మ‌ల్టీప్లెక్స్‌ల‌లో 300, సింగిల్ స్ర్కీన్స్‌లో 175గా టికెట్ ధ‌ర‌లు ఉన్నాయి.

కానీ థాంక్యూ సినిమాకు తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్ లో 100 ప్లస్ జీఎస్టీ, మల్టీప్లెక్స్ లలో 150 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించినట్లు పేర్కొన్నాడు. ధరల తగ్గింపు వల్ల తనకు వచ్చే లాభం తగ్గుతుందని అయినా ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.ఏపీలో మాత్రం టికెట్ ధ‌ర‌ల‌తో పెద్ద‌గా మార్పులు చేయ‌డం లేద‌ని తెలిసింది. ఏపీలో సింగిల్ స్క్రీన్స్‌లో 125 ప్లస్ జీఎస్టీ రూపాయల కనీస ధరగా ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ రేట్స్ ను తగ్గించడం కుదరదని పేర్కొన్నారు.

మ‌ల్టీప్లెక్స్‌ల‌లో 177 రూపాయ‌లుగా ఉండబోతున్నట్లు తెలిపారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసమే ఈ ధరలను నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ సినిమాలోరాశీఖ‌న్నా, మాళ‌వికానాయ‌ర్‌, అవికాగోర్ హీరోయిన్లుగా న‌టించారు. త‌మ‌న్ సంగీతాన్నిఅందిస్తున్నారు. బీవీఎస్ ర‌వి క‌థ‌ను అందిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్