Tirumala : ఈ నెలలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలివే - 31న దీపావళి ఆస్థానం-the following are the series of events lined up in tirumala in this month 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : ఈ నెలలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలివే - 31న దీపావళి ఆస్థానం

Tirumala : ఈ నెలలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలివే - 31న దీపావళి ఆస్థానం

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 02, 2024 01:23 PM IST

TTD Latest News: ఈ అక్టోబర్ మాసంలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు ఆయా తేదీలు, ఉత్సవాలను పేర్కొంది. ఈనెల⁠ ⁠3న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది.

అక్టోబ‌రు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
అక్టోబ‌రు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ అక్టోబర్ నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాలను ప్రకటించింది. ఈ మేరకు పూర్తి వివరాలను వెల్లడించింది.  అక్టోబర్⁠ ⁠3వ తేదీన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని పేర్కొంది. ⁠అక్టోబ‌రు 4న ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక⁠ ⁠అక్టోబ‌రు 31న శ్రీ‌వారి ఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానం జరగనుంది.

ఈ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు..

•⁠ ⁠అక్టోబ‌రు 2: మహాలయ అమావాస్య

•⁠ ⁠3న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

•⁠ ⁠అక్టోబ‌రు 4న ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

•⁠ ⁠అక్టోబ‌రు 8న శ్రీవారి గరుడసేవ.

•⁠ ⁠అక్టోబ‌రు 9న శ్రీవారి స్వర్ణరథోత్సవం.

•⁠ ⁠అక్టోబ‌రు 11న ర‌థోత్స‌వం.

•⁠ ⁠అక్టోబ‌రు 12న శ్రీవారి చక్రస్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు స‌మాప్తి.

•⁠ ⁠అక్టోబ‌రు 13న శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం.

•⁠ ⁠అక్టోబ‌రు 28న సర్వ ఏకాదశి.

•⁠ ⁠అక్టోబ‌రు 31న శ్రీ‌వారి ఆల‌యంలో దీపావ‌ళి ఆస్థానం

శ్రీవారి బ్రహ్మోత్సవాలు - రేపు అంకుర్పారణ:

ఇక 9 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 4 నుంచి 12 వరకు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. రేపు 3న అంకురార్పణతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. 

ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్య (అక్టోబర్ 4 మినహా) వాహన సేవలు ఉంటాయి. రోజు వారీగా ఉదయం, సాయంత్రం వాహన సేవల షెడ్యూల్ ఈ విధంగా ఉంటుంది.

  • అక్టోబర్ 4 : శుక్రవారం సాయంత్రం 5:45 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ధ్వజారోహణం ఉంటుంది. రాత్రి 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పెద్ద శేష వాహనం ఉంటుంది.
  • అక్టోబర్ 5 : శనివారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు చిన్నశేష వాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హంస వాహన సేవ నిర్వహిస్తారు.
  • అక్టోబర్ 6 : ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు సింహ వాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ముత్యపుపందిరిలో స్వామివారు విహరిస్తారు.
  • అక్టోబర్ 7 : సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటలకు కల్పవృక్షం సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వ భూపాల సేవ నిర్వహిస్తారు.
  • అక్టోబర్ 8 : మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహన సేవ ఉంటుంది.
  • అక్టోబర్ 9: బుధవారం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గజవాహన సేవ నిర్వహిస్తారు.
  • అక్టోబర్ 10 : గురువారం ఉదయం 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది.
  • అక్టోబర్ 11 : శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి రథోత్సవం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వ వాహన సేవ ఉంటుంది.

ఇక అక్టోబర్ 12వ తేదీన చక్నస్నానం ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల ఈ క్రతువు జరుగుతుంది. ఇక అదే రోజు రాత్రి 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Whats_app_banner