Bolisetti Srinivas : అల్లు అర్జున్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి ఘాటు వ్యాఖ్యలు-tadepalligudem janasena mla bolisetti srinivas fires on allu arjun comments on pawan kalyan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bolisetti Srinivas : అల్లు అర్జున్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి ఘాటు వ్యాఖ్యలు

Bolisetti Srinivas : అల్లు అర్జున్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి ఘాటు వ్యాఖ్యలు

Bandaru Satyaprasad HT Telugu
Aug 27, 2024 07:48 PM IST

Bolisetti Srinivas On Allu Arjun : మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ కొనసాగుతోంది. తాజాగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యారు. ఇక్కడున్నది మెగా ఫ్యాన్స్ మాత్రమే అన్నారు. అల్లు అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

అల్లు అర్జున్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి ఘాటు వ్యాఖ్యలు
అల్లు అర్జున్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి ఘాటు వ్యాఖ్యలు

Bolisetti Srinivas On Allu Arjun : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది. గతంలో హీరో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు, ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంపై మెగా ఫ్యాన్స్, జనసేన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎర్రచందనం దొంగలను హీరోలుగా చూపిస్తున్నారన్నారు. ఈ కామెంట్స్ పై బన్నీ ఫ్యాన్స్ గరం అవుతున్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా అల్లు అర్జున్ ఓ సినీ కార్యక్రమంలో నాకు ఇష్టముంటేనే వస్తా, నా ఫ్యాన్స్ కోసమే నేను హీరో అయ్యాను అంటూ పరోక్షంగా పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు.

అల్లు అర్జున్ వ్యాఖ్యలకు తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్న విషయం తనకు తెలియదన్నారు. ఆయన తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఊహించుకుంటున్నారేమో, ఇక్కడుంది చిరంజీవి ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ మాత్రమే అన్నారు. మెగా ఫ్యామిలీ నుంచి విడిపోయి ఎవరైనా షామియానా కంపెనీల్లాగా బ్రాంచ్ లు పెట్టుకున్నారేమో తమకు తెలియదన్నారు. అల్లు అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారన్నారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచిందని, అల్లు అర్జున్ స్వయంగా వెళ్లి ప్రచారం చేసినా వైసీపీ అభ్యర్థి ఓడిపోయారని విమర్శించారు. అల్లు అర్జున్ అవసరం మాకు లేదని ఘాటుగా స్పందించారు.

"చిరంజీవి అభిమానులు, పవన్ కల్యాణ్ అభిమానులు, రామ్ చరణ్ ఫ్యాన్స్ మీలో ఆ నటులను చూసుకుంటున్నారు అంతే. నాకు ఇష్టముంటేనే వస్తా, నిన్ను ఎవరు రమ్మన్నారు. నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? అల్లు అరవింద్ ఎంపీగా నిలబడితే గెలిపించుకోలేకపోయారు. మీరు అందర్ని విమర్శించడం సరికాదు" - జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

నా వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం

“నాకు ఇష్టమైతే నేను వస్తా.. ఒక మెగా అభిమానిగా చిరంజీవిని కానీ, నాగబాబును కానీ, పవన్ కల్యాణ్ ను కానీ ఎవరైనా సరే గౌరవం లేకుండా మాట్లాడితే నేను వస్తా! గతాన్ని మర్చిపోయి మాట్లాడితే కచ్చితంగా వస్తా! మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమనగా.. నా వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం. ఒక మెగా అభిమానిగా మాత్రమే నేను స్పందించా గమనించగలరు" అని బొలిశెట్టి ట్వీట్ చేశారు.

పవన్ కల్యాణ్ పై అల్లు అర్జున్ మామ కామెంట్స్

మెగా ,అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తున్నాయి. పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా... లోలోపల మాత్రం వివాదాలు తీవ్రస్థాయికి చెరుకున్నట్లు కనిపిస్తోంది. మెగా ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్తలు ఇటీవల ప్రచారం అయ్యాయి. అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడంతో నాగబాబు ట్వీట్ చేయడం, ఆ తర్వాత ఆయన ట్విట్టర్ అకౌంట్ నే డిలీట్ చేయడం సంచలనం అయ్యింది.

హీరోలు అడువులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని ఇటీవల పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇలాంటి సినిమాలు చేయడానికి చాలా ఇబ్బంది పడతానన్నారు. అయితే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ను ఉద్దేశించే అన్నారని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తండ్రి చంద్ర శేఖర్ రెడ్డి స్పందించారు. పవన్ కల్యాణ్ అలా మాట్లాడి ఉండకూడదని, తన వ్యాఖ్యలను పవన్ వివరణ ఇవ్వాల్సింది అన్నారు. పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని కోరారు. పుష్ప సినిమాలో నటనకు అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డు వచ్చిందని గుర్తుచేశారు. దీంతో మెగా వర్సెస్ అల్లు వివాదంలో కుటుంబ సభ్యులు ఎంటర్ అయినట్లైంది.

సంబంధిత కథనం