Allu Arjun: అల్లు అర్జున్ మా అన్నయ్య.. బన్నీతో యాడ్ చేశా.. ఆయ్ మూవీ కమెడియన్ అంకిత్ కొయ్య
Ankith Koyya About Allu Arjun And OLX Ad: అల్లు అర్జున్‌తో ఓఎల్ఎక్స్ యాడ్ చేసినట్లు ఆయ్, మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమాల నటుడు అంకిత్ కొయ్య చెప్పాడు. అల్లు ఫ్యామిలీ పుట్టా.. అల్లు అర్జున్ మా అన్నయ్య అని చెప్పే రోల్‌లో తాను నటించినట్లు అంకిత్ కొయ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Ankith Koyya About Allu Arjun OLX Ad: ఆయ్ సినిమాలో హీరోకు ఫ్రెండ్‌గా కమెడియన్‌గా యాక్ట్ చేశాడు అంకిత్ కొయ్య. ఈ సినిమాలో అంకిత్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే అంకిత్ కొయ్య నటించిన మరో సినిమా మారుతి నగర్ సుబ్రమణ్యం.
రావు రమేష్ కథానాయకుడిగా రూపొందిన ఈ మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమాలో ఆయన కుమారుడిగా అంకిత్ కొయ్య నటించాడు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు.
ఆగస్టు 23న మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత్ కొయ్య మీడియాతో మాట్లాడారు. సినిమాకు సంబంధించి, అల్లు అర్జున్, బన్నీతో చేసిన ఓఎల్ఎక్స్ అడ్వర్టైజ్‌మెంట్‌కు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు అంకిత్ కొయ్య.
మీరు చాలా సినిమాల్లో నటించారు. ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మీ గురించి చెప్పండి!
మాది విశాఖ. గీతం యూనివర్సిటీలో బీటెక్ చేశా. స్కూల్ డేస్ వరకు సాధారణంగా ఉన్నాను. గ్రూమింగ్ అంటే కూడా తెలియదు. దీపక్ సరోజ్ అని నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు. తను చైల్డ్ ఆర్టిస్ట్. చాలా సినిమాల్లో నటించాడు. అతని వల్ల నాకు కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశా.
రెండేళ్ల తర్వాత మా సీనియర్లు కొత్తగా వచ్చే వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వమని నాకు అప్పజెప్పేవారు. అక్కడి నుంచి మెల్లగా యాడ్స్, సినిమాల్లోకి వచ్చాను. కాలేజీలో ఉండగా.. అల్లు అర్జున్ గారితో ఓఎల్ఎక్స్ యాడ్‌లో నటించే అవకాశం వచ్చింది. ఆడిషన్ చూసి బన్నీ గారు స్వయంగా నన్ను ఎంపిక చేశారు.
'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?
ఈ సినిమాలో ఇంద్రజ గారు నాకు అమ్మ క్యారెక్టర్ చేశారు. ఆవిడకు మా దర్శకుడు లక్ష్మణ్ కార్య కథ నేరేట్ చేసినప్పుడు.. అబ్బాయి పాత్రకు ఆవిడ నన్ను సజెస్ట్ చేశారు.
ఓ సినిమాలో మేం మదర్ అండ్ సన్ రోల్స్ చేశాం. ఆ మూవీ ఇంకా విడుదల కాలేదు. నేను ఆవిడతో షూటింగ్ చేసినది రెండు రోజులే. నా పేరు కూడా ఆవిడకు గుర్తు లేదు. కానీ, లక్ష్మణ్ అన్న కథ చెబితే... ఆ అబ్బాయి అయితే చాలా బావుంటాడని రిఫర్ చేశారు.
లక్ష్మణ్ కార్య కనుక్కుంటే.. అప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్లు చూసి చేయగలనో లేదో అని సందేహించారు. ఆడిషన్ తర్వాత అంతా ఓకే అయింది.
సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి!
చిన్నప్పుడు ఇంట్లో ఏడిపిస్తారు కదా.. 'నువ్వు మాకు పుట్టలేదు. ఎక్కడి నుంచో తీసుకు వచ్చాం' అని! నా క్యారెక్టర్ ఏమిటంటే.. 'నేను ఈ ఇంట్లో పుట్టలేదు, అల్లు అరవింద్ కొడుకును. అల్లు అర్జున్ మా అన్నయ్య' అనుకునే టైపు. ఒకానొక సీన్ వచ్చినప్పుడు రావు రమేష్ గారిని 'మా ఇంటికి ఎప్పుడు పంపిస్తావ్' అని కూడా అడుగుతాడు. ఆ క్యారెక్టర్ నుంచి మంచి ఫన్ జనరేట్ అయింది.