Allu Arjun: ఇష్టమైతే వస్తా.. అల్లు అర్జున్ మళ్లీ దింపేశాడా? మెగా ఫ్యామిలీకి బన్నీ ఇచ్చిన మాస్ రిప్లై అంటున్న ఫ్యాన్స్
Allu Arjun: అల్లు అర్జున్ మరోసారి దింపేశాడా? మెగా ఫ్యామిలీకి తనదైన స్టైల్లో పరోక్షంగా ఇచ్చిన మాస్ రిప్లైయా ఇది? ఫ్యాన్స్ మాత్రం అదే అంటున్నారు. మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చిన బన్నీ.. తన వాళ్ల కోసం అంటూ చేసిన కామెంట్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Allu Arjun: అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ మధ్య కొన్నాళ్లుగా వైరం నడుస్తోందన్న వార్తలు తెలుసు కదా. ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ కూటమి ప్రత్యర్థి అయిన వైఎస్సార్సీపీ అభ్యర్థి తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేయడం దుమారం రేపింది. దీనిపై బన్నీ క్లారిటీ ఇచ్చినా.. నాగబాబు ట్వీట్ అగ్నికి ఆజ్యం పోసింది. అయితే ఆ గొడవ సద్దుమణిగినట్లే కనిపించినా.. తాజాగా మారుతీనగర్ సుబ్రమణ్యం మూవీ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి.
నాకిష్టమైతే నేనొస్తా: అల్లు అర్జున్
ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాకిష్టమైతే వస్తా.. నా వాళ్ల కోసం నిలబడతా అని చేసిన కామెంట్స్ పరోక్షంగా మెగా ఫ్యామిలీకి బన్నీ ఇచ్చిన మాస్ రిప్లై అంటూ ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ పోస్ట్ చేస్తున్నారు. మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమాకు సుకుమార్ భార్య తబిత ప్రొడ్యూసర్ గా ఉంది.
ఆమె పిలిచినందుకే తాను చాలా బిజీగా ఉన్నా కూడా ఈ ఈవెంట్ కు వచ్చానంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. "పుష్ప 2 క్లైమ్యాక్స్ చాలా చాలా క్లిష్టమైనది. అది చేస్తూ కూడా ఇక్కడికి వచ్చానంటే ఆమే కారణం. ఆమె ఆ మాట అన్న తర్వాత కాదనలేకపోయాను. ఎందుకంటే ఇష్టమైనోళ్లకి మనం చూపించాలి. మనం నిలబడగలగాలి. మన ఫ్రెండ్ అనుకో, కావాల్సిన వాళ్లనుకో.. నాకిష్టమైతే నేనొస్తా. నా మనసుకు నచ్చితే నేకు వస్తా. అది మీ అందరికీ తెలిసిందే" అని అల్లు అర్జున్ అనగానే అక్కడున్న అభిమానులంతా పెద్దగా అరిచారు.
మెగా ఫ్యామిలీకి ఇచ్చిన సమాధానమేనా?
బన్నీ ఈ కామెంట్స్ ఊరికే చేయలేదని, ఇది మెగా ఫ్యామిలీకి అతడు ఇచ్చిన మాస్ రిప్లై అని అతని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఆల్ఫా అబ్బాయ్ అల్లు అర్జున్ అనే క్యాప్షన్ లో ఓ అభిమాని ఈ వీడియోను పోస్ట్ చేశాడు. స్లిప్పర్ షాట్ రిప్లై అంటూ మరో ఫ్యాన్ కామెంట్ చేశాడు. లైట్ గా ఆ భాయ్ ఫ్యాన్ అయిపోవాలని అనిపిస్తోంది.. ఆ గట్స్ కి.. అంటూ మరో అభిమాని ఈ వీడియో షేర్ చేశాడు. వాళ్లకు సైలెంట్ గా దింపాడు అంటూ ఇంకొకరు అన్నారు.
నిజానికి అల్లు అర్జున్ ఆ మాటలు అన్న తీరు చూస్తుంటే లోలోపల ఆ అంశంపై వేదన చెందుతున్నట్లుగానే అనిపించింది. ఈ ఈవెంట్ మొదట్లోనే ఫ్యాన్స్ ను చూసి అతడు ఎమోషనల్ అయ్యాడు. తన ఫ్యాన్స్ కోసమే తాను హీరో అయ్యానని, థ్యాంక్యూ అంటూ బన్నీ చెప్పాడు.
అయితే అతడు చేసిన ఈ కామెంట్స్ చూస్తుంటే మెగా ఫ్యామిలీతో సంబంధాలను పునరుద్ధరించే ఆలోచనలేవీ లేనట్లు అర్థమవుతూనే ఉంది. ఈ ఈవెంట్లో అతని స్పీచ్ అంతా ఎమోషనల్ గానే సాగింది. ఒకరకంగా ముందుగానే ఇలా మాట్లాడాలని ప్రిపేర్ అయి వచ్చినట్లుగా అనిపించింది. కొసమెరుపు ఏంటంటే.. రాత్రి ఈ స్పీచ్ ఇచ్చిన బన్నీ.. మరుసటి రోజు అంటే ఇవాళ (ఆగస్ట్ 22) మెగాస్టార్ చిరంజీవి 69వ బర్త్ డే సందర్భంగా.. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు అవర్ మెగాస్టార్ చిరంజీవిగారు అని ట్వీట్ చేశాడు.