Tirumala Brahmotsavam : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు - సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప దర్శనం-suryaprabha vahanam seva was held in tirumala srivari navaratri brahmotsavams 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Brahmotsavam : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు - సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప దర్శనం

Tirumala Brahmotsavam : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు - సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప దర్శనం

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 21, 2023 12:02 PM IST

Navaratri Brahmotsavams at Tirumala 2023 : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు అయిన శనివారం ఉదయం …. శ్రీ మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై కటాక్షించారు.

తిరుమల బ్రహ్మోత్సవాలు
తిరుమల బ్రహ్మోత్సవాలు

Tirumala Srivari Navaratri Brahmotsavams 2023 : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

yearly horoscope entry point
సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప దర్శనం
సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప దర్శనం (TTD)

సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్య‌ప్రాప్తి

సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులతో పాటు భక్తులు భారీగా పాల్గొన్నారు.

సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప దర్శనం
సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప దర్శనం (TTD)

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు గజ వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహ‌న‌సేవ ద‌ర్శ‌నం వ‌ల్ల క‌ర్మ విముక్తి క‌లుగుతుంద‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్స‌వాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి.

Whats_app_banner