SBI PA Policy : ఎస్బీఐ వ్యక్తిగత ప్రమాద బీమా- ఏడాదికి రూ.1000 చెల్లిస్తే రూ.20 లక్షల బెనిఫిట్
SBI PA Policy : ఎస్బీఐలో ఖాతా ఉన్నవారు రూ.20 లక్షల వరకు ప్రమాదబీమా పొందవచ్చు. ఖాతాదారులు ఏడాదికి రూ.1000 చెల్లిస్తే రూ.20 లక్షల ప్రమాదబీమా అందిస్తోంది ఎస్బీఐ. యోనో యాప్ లో సులభంగా పొందవచ్చు. ఎస్బీఐ బ్యాంకులో సంప్రదించి ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ పరిమితి ఏడాది. అనంతరం రెన్యువల్ చేసుకోవచ్చు.
SBI PA Policy : ఎస్బీఐ తన ఖాతాదారులకు ప్రమాద బీమా అందిస్తోంది. ఎస్బీఐలో అకౌంట్ కలిగి ఉంటే(జీరో బ్యాలెన్స్ అయిన) ఏడాదికి రూ.1000 ప్రీమియంతో రూ.20 లక్షలు ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తుంది. అనుకోని ప్రమాదాలతో మరణం సంభవిస్తే నామినీకి పూర్తి నగదు అందిస్తారు. ఈ మేరకు ఎస్పీఐ జనరల్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అమలు చేస్తుంది.
గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. సేవింగ్స్ బ్యాంక్ / వ్యక్తిగత కరెంట్ అకౌంట్ కలిగి ఉన్న భారతీయులు ఈ పాలసీకి అర్హులు. ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంక్‌లలో ఖాతా కలిగి ఉన్న 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ పాలసీ పొందవచ్చు. ఎస్బీఐ గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో రూ.20 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని పొందవచ్చు. ఖాతాదారులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.20 లక్షలు వారి కుటుంబానికి చెల్లిస్తారు.
వయోపరిమితి
పాలసీదారుడికి తప్పనిసరిగా 18-65 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
పాలసీ రద్దు, క్లెయిమ్
పాలసీదారు ఈ పాలసీని రద్దు చేసుకోవాలనుకుంటే రాతపూర్వక నోటీసు ఇచ్చిన 15 రోజుల్లో పాలసీని రద్దు చేసుకోవచ్చు. క్లెయిమ్‌లకు తప్పనిసరిగా 90 రోజులలోపు బీమా కంపెనీకి తెలియజేయాలి. సంఘటన జరిగిన 180 రోజులలోపు అన్ని సంబంధిత పత్రాలను సమర్పించాలి. ప్రమాదం వల్ల కలిగే ప్రాణనష్టం, వైకల్యాలు, ఇతర ఖర్చును ఈ పాలసీ కవర్ చేస్తుంది. శాశ్వత వైకల్యం, పాక్షిక వైకల్యం, తాత్కాలిక అంగవైకల్యం, ఆసుపత్రి ఖర్చులు, అంబులెన్స్ ఖర్చులు వంటి సెలెక్టడ్, యాడ్-ఆన్ కవర్‌లను కూడా ఇది అందిస్తుంది.
జీరో బ్యాలెన్స్ అకౌంట్
ఈ పాలసీకి ఖాతాదారుల అకౌంట్ లో కనీస బ్యాలెన్స్ అవసరం లేదు.
ఉచిత బీమా
ఎస్బీఐలో సాలరీ అకౌంట్ కలిగిన ఉన్న వారు రూ. 20 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాదబీమా, రూ. 30 లక్షల వరకు విమాన ప్రమాద మరణ కవరేజీ పొందవచ్చు. ప్రమాదం జరిగిన 90 రోజులలోపు ఈ బీమాకు దరఖాస్తు చేసుకోవాలి. సాలరీ అకౌంట్ లేని వారు ప్రమాద బీమా పథకంలో చేరడానికి ఏడాది రూ. 1000 చెల్లిస్తే రూ.20 లక్షల కవరేజీ వస్తుంది. రూ.100 చెల్లిస్తే రూ.2 లక్షలు, రూ.200 చెల్లి్స్తే రూ.4 లక్షలు, రూ.500 చెల్లిస్తే రూ.10 లక్షల కవరేజీ పొందవచ్చు.
బీమా కవరేజీ
- రూ.2 లక్షలు - రూ.100 ప్రీమియం
- రూ.4 లక్షలు - రూ.200 ప్రీమియం
- రూ.10 లక్షలు - రూ.500 ప్రీమియం
- రూ.20 లక్షలు - రూ.1000 ప్రీమియం
ఆన్ లైన్ లో దరఖాస్తు ఇలా?
ఎస్బీఐ యోనో యాప్ లో సులభంగా క్షణాల్లో ఈ పాలసీ పొందవచ్చు.
- YONO SBI యాప్‌కి లాగిన్ అవ్వండి
- ఇన్సూరెన్స్ విభాగానికి వెళ్లండి
- Buy A Policy పై క్లిక్ చేయండి
- వ్యక్తిగత ప్రమాద బీమాను ఎంచుకోండి
- అమౌంట్ పే చేసిన తర్వాత పాస్ వర్డ్ ఆధారిత సర్టిఫికెట్ పీడీఎఫ్ వస్తుంది. దానిని భద్రపరుచుకోండి.
ఆఫ్ లైన్ లో ఈ పాలసీ పొందేందుకు మీ దగ్గర్లోని ఎస్బీఐ బ్యాంకులో సంప్రందించాలి. మీ వివరాలు, ఖాతా వివరాలు తెలియజేసి ప్రమాద బీమా పొందవచ్చు.
సంబంధిత కథనం