SSC Students: APలో స్క్రైబ్ లేకుండానే పది పరీక్షలు రాసిన దివ్యాంగులు… కంప్యూటర్‌ సాయంతో డిజిటల్ పరీక్షలు-physically challenged students appearing ssc exams without scribe in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ssc Students: Apలో స్క్రైబ్ లేకుండానే పది పరీక్షలు రాసిన దివ్యాంగులు… కంప్యూటర్‌ సాయంతో డిజిటల్ పరీక్షలు

SSC Students: APలో స్క్రైబ్ లేకుండానే పది పరీక్షలు రాసిన దివ్యాంగులు… కంప్యూటర్‌ సాయంతో డిజిటల్ పరీక్షలు

Sarath chandra.B HT Telugu
Mar 19, 2024 06:04 AM IST

SSC Students: ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులైన పదో తరగతి విద్యార్ధులు వ్యక్తిగత సహాయకుడు లేకుండా పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. డిజిటల్ పద్ధతిలో తొలిసారి అంధులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఆడియో ప్రశ్నలు వింటూ  పరీక్షలు రాస్తున్న విద్యార్ధులు
ఆడియో ప్రశ్నలు వింటూ పరీక్షలు రాస్తున్న విద్యార్ధులు

SSC Students: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్షల్లో డిజిటల్‌ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. అంధులు, స్వయంగా పరీక్షలు రాయలేని వైకల్యాలు ఉన్న దివ్యాంగులు Divyang గతంలో వ్యక్తిగత సహాయకుడి సాయంతో పరీక్షలకు హాజరయ్యేవారు. 

స్క్రైబ్ చెబుతుంటే ప్రశ్నలకు అనుగుణంగా సమాధానాలు చెబితే స్క్రైబ్ Scribe పరీక్షల్లో జవాబులు రాసేవారు. ఈ ఏడాది తొలిసారి డిజిటల్ పద్ధతిలో పదో తరగతి పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు నేరుగా ఎవరి సహాయం లేకుండానే పరీక్షలు రాస్తున్నారు.

అనంతపురం జిల్లాలోని రాప్తాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో 13 మంది దివ్యాంగ విద్యార్థులు కంప్యూటర్లను ఉపయోగించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు.

విద్యార్థులు ఎలాంటి స్క్రైబ్‌ సహాయం లేకుండా డిజిటల్ Digital ప్రశ్నపత్రాలను విని, సమాధానాలను కంప్యూటర్లో సమాధానాలు టైప్ చేస్తున్నారు. గత ఏడాది అనంతపురం RDT స్కూల్ నుంచి ఆరుగురు విద్యార్థులు డిజిటల్ విధానంలో పరీక్షలు రాసి దేశంలో చరిత్ర సృష్టించారు.

విద్యార్ధులకు ముందు నుంచి డిజిటల్ టెక్నాలజీ వినియోగంపై అవగాహన కల్పించి,కంప్యూటర్లలో సమాధానాలు ఇవ్వడంపై తర్ఫీదు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది 13 మంది పదో తరగతి డిజిటల్ పరీక్షలు రాసి సరికొత్త రికార్డు సాధించారు.

‘వైకల్యం శరీరానికే కాని మనసుకు కాదు.. తపన ఉంటే ఏవైనా సాధించవచ్చని దివ్యాంగులైన విద్యార్థులు నిరూపించారని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు.

13 మంది విద్యార్థులు…

భిన్న రకాలైన వైకల్యాలు ఉన్న విద్యార్ధులు ఈ ఏడాది డిజిటల్ పద్ధతిలో పరీక్షలు రాస్తున్నారు.

అంధత్వం, హ్రస్వ దృష్టి ఉన్న పిల్లలతో పాటు ఇతర ప్రత్యేక అవసరాలైన న్యూరోడైవర్సిటీ, అప్పర్ బాడీ ఛాలెంజ్‌లు, అప్పర్ ఆర్థోపెడిక్ ఛాలెంజ్ విద్యార్థులు కూడా కంప్యూటర్‌లను ఉపయోగించి తమ పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యారు.

అప్పర్ ఆర్థోపెడిక్ ఛాలెంజ్ కేటగిరీలో ఎ. గురుస్వామి, ఆర్. భార్గవి డిజిటల్ పరీక్షలు రాశారు. విజువల్ ఛాలెంజ్డ్ (దృష్టిలోపం) గల విద్యార్థులు 11 మంది ఎ. రవీశ్వర్, కె. మల్లిక, పి. మదిహ, బి. మేఘన, జి. శ్రావణి, ఎన్. సుమ, సి. నిర్మల, కె. దీపిక, ఎస్. దిలీప్, జె. సాయినాథ్, వి. నవీన్ కుమార్ మంది పరీక్షలు రాస్తున్నారు.

దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంధ విద్యార్థుల కోసం ఆడియో ప్రశ్నపత్రాలను పైలట్ ప్రాజెక్టుగా రూపొందించడం వినూత్నచర్యగా విద్యా శాఖ వర్గాలు అభివర్ణించాయి.

ప్రత్యేక అవసరాలు ఉన్న 12 మంది విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. భవిష్యత్ లో ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు ఈ సౌకర్యం మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ తరహా డిజిటల్ పరీక్షల విధానంపై కసరత్తు చేస్తున్నారు.

ఇక ఆ వ్యత్యాసాలు ఉండవు…

పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, పాసైన విద్యార్థుల మధ్య వ్యత్యాసాన్ని మార్క్ షీట్లలో చూపించకుండా ఉండేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించింది.

బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులు, సప్లిమెంటరీ ఉత్తీర్ణతలు స్పష్టంగా తెలిసేలా స్టార్ మార్కుతో మార్క్ షీట్లు విడుదల చేసేవారు.ఇకపై వివక్ష లేకుండా మార్క్ షీట్స్‌ విడుదల చేయనున్నారు. గతేడాది పరీక్షల్లో ఫెయిల్ అయిన 1,125 మంది విద్యార్థుల మార్కులను సబ్జెక్ట్ ల వారీగా మార్కులు పరిగణలోకి తీసుకొని వారిని రెగ్యులర్ విద్యార్థులుగా నమోదు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

సంబంధిత కథనం