AP SSC Hall Tickets : ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!
AP SSC Hall Tickets : ఏపీ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలతో నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
AP SSC Hall Tickets : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు(AP SSC Hall Tickets Download) ఆన్ లైన్ లో విడుదలయ్యాయి. విద్యార్థులు నేరుగా అధికారిక వెబ్ సైట్ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పదో తరగతి వార్షిక పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్‌టికెట్లను సోమవారం విడుదల చేసినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌కు విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్ష కేంద్రాలు
అధికారిక వెబ్ సైట్ www.bse.ap.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతి(AP SSC Exams) పబ్లిక్ పరీక్షలకు 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. అయితే గతేడాది పదో తరగతి తప్పి తిరిగి రాస్తున్న వారు 1,02,528 మంది రెగ్యులర్‌గా పరీక్షలు రాయనున్నారు. మొత్తంగా ఈసారి 7,25,620 మంది టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. పదో తరగతి(10th Exams) పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,473 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మార్చి 18 నుంచి మార్చి 28 వరకు ప్రధాన పరీక్షలు నిర్వహిస్తున్నారు. 29, 30 తేదీల్లో ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్ లీక్(Paper Leak) , మాల్ ప్రాక్టీస్ అరికట్టేందుకు విద్యాశాఖ 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్వాడ్స్‌ను సిద్ధం చేసింది. దీంతో 130కి పైగా పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలను(CC Cameras) ఏర్పాటు చేశారు. వీటితో నిరంతరం పరీక్షల నిర్వహణ తీరును విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించనున్నారు. గత ఏడాది పేపర్ లిక్ వివాదం దృష్టిలో పెట్టుకుని పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
AP SSC హాల్ టికెట్ డౌన్‌లోడ్ ఇలా?
Step 1 : అధికారిక వెబ్‌సైట్‌ను bse.ap.gov.in సందర్శించండి
Step 2 : మెయిన్ పేజీలో SSC Public Examination 2024 Hall Tickets డౌన్‌లోడ్ లింక్ పై క్లిక్ చేయండి.
Step 3 : తర్వాతి పేజీలో విద్యార్థి హాల్ టికెట్ కేటరిగీపై క్లిక్ చేసి... విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డౌన్ లోడ్ హాల్ టికెట్ బటన్‌ను నొక్కండి.
Step 4 : తర్వాతి పేజీలో పదో తరగతి హాల్ టికెట్(AP SSC Hall Tickets) కనిపిస్తుంది.
Step 5 : హాల్ టికెట్ ను డౌన్‌లోడ్(Download) చేసుకుని, ప్రింటవుట్ తీసుకోండి.