AP TET 2024 : ఏపీ 'టెట్'కు అప్లై చేశారా..? దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ-oline application process for the ap tet 2024 will end today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet 2024 : ఏపీ 'టెట్'కు అప్లై చేశారా..? దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ

AP TET 2024 : ఏపీ 'టెట్'కు అప్లై చేశారా..? దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 18, 2024 09:18 AM IST

AP TET 2024 Updates: ఏపీ టెట్ -2024 దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. టెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 23 నుంచి హాల్‌‌ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు పరీక్షలు జరగనున్నాయి.

ఏపీ టెట్ దరఖాస్తులు
ఏపీ టెట్ దరఖాస్తులు ((https://aptet.apcfss.in/)

Andhra Pradesh Teacher Eligibility Test 2024: ఏపీ టెట్ నోటిఫికేషన్ వచ్చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో (ఫిబ్రవరి 18) ముగియనుంది. అయితే ఫీజు పేమెంట్ చెల్లించాల్సిన తేదీ ఫిబ్రవరి 17వ తేదీతో పూర్తి అయింది. ఈ తేదీలోపు ఎవరైతే ఫీజు చెల్లించారో… వారు మాత్రమే దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. ఫిబ్రవరి 19వ తేదీన ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ రాసేందుకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి హాల్‌ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ మధ్యలో పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలను https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

How to Apply for AP TET 2024 : ఇలా అప్లై చేసుకోండి..

అర్హత గల అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://aptet.apcfss.in/ లోకి వెళ్లాలి.

పేమెంట్ ప్రక్రియ పూర్తి చేసినవారికి మాత్రమే లాగిన్ ఐడీ క్రియేట్ అవుతుంది.

ఈ లాగిన్ వివరాలతో మీ దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేయవచ్చు.

ఫొటో, సంతకంతో పాటు కావాల్సిన పత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

సబ్మిట్ బటన్ పై నొక్కి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి అప్లికేషన్ ఫారమ్ ను పొందవచ్చు. హాల్ టికెట్ల సమయంలో అప్లికేషన్ నెంబర్ అవసరపడుతుంది.

ఏపీ టెట్ 2024 ముఖ్య తేదీలు:

ఏపీ టెట్ నోటిఫికేషన్ - ఫిబ్రవరి 7, 2024.

దరఖాస్తులకు తుది గడువు - ఫిబ్రవరి 18 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు.

ఈ నెల 19వ తేదీన అభ్యర్థులు మాక్ టెస్ట్ రాసేందుకు అవకాశం కల్పించారు.

ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్స్‌లో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

టెట్ ప్రాథమిక కీ మార్చి 10న విడుదల చేస్తారు.

ఈ కీపై అభ్యంతరాలను మార్చి 11 వరకు స్వీకరిస్తారు.

టెట్ తుది కీని మార్చి 13న రిలీజ్‌ చేస్తారు.

మార్చి 14న టెట్‌ తుది ఫలితాలు విడుదల చేస్తారు.

డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

టెట్‌, డీఎస్సీ పరీక్షలను కంప్యూటర్‌ ఆధారంగా నిర్వహించనున్నారు.

టెట్ అర్హతలు..

టెట్ రాసే అభ్యర్థుల్లో…. ఒకటవ తరగతి నుంచి 5 వరకు బోధించే సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు నిర్వహించే టెట్‌-1 పేపర్‌కు రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ), నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (బీఈఎల్‌ఈడీ) చేసిన వారే అర్హులు. కోర్సు చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. పేపర్-1 పరీక్ష రాసే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్‌ పేపర్‌–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధన ఉంది. దీన్ని సవరించి ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. ఈసారి నుంచే ఈ నిర్ణయాలను అమలుచేయనున్నారు. గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించి, డీఎస్సీ, టెట్ కలిపి 100 మార్కులకు పరీక్ష నిర్వహించారు.

Whats_app_banner

సంబంధిత కథనం