TS SET Hall Ticket 2023 : టీఎస్‌ సెట్‌ హాల్‌ టికెట్లు విడుదల... డౌన్లోడ్ లింక్ ఇదే-ts set hall ticket 2023 released at httptelanganasetorg ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Set Hall Ticket 2023 : టీఎస్‌ సెట్‌ హాల్‌ టికెట్లు విడుదల... డౌన్లోడ్ లింక్ ఇదే

TS SET Hall Ticket 2023 : టీఎస్‌ సెట్‌ హాల్‌ టికెట్లు విడుదల... డౌన్లోడ్ లింక్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 20, 2023 03:54 PM IST

TS SET Hall Ticket 2023 Updates: తెలంగాణ సెట్ - 2023 హాల్ టికెట్లు వచ్చేశాయి. అక్టోబర్‌ 28, 29, 30 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.

సెట్ హాల్ టికెట్లు
సెట్ హాల్ టికెట్లు

TS SET 2023 Updates: తెలంగాణ సెట్(TS SET-2023) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది టీఎస్ సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తికాగా… తాజాగా హాల్ టికెట్లను విడుదల చేసింది. అక్టోబర్‌ 28, 29, 30 తేదీల్లో పరీక్షలు జగనున్నాయి. http://telanganaset.org/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చను అధికారులు తెలిపారు.

డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మొదటగా http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

డౌన్లోడ్ హాల్ టికెట్లు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Application No, Passwordని ఎంట్రీ చేయాలి.

సబ్మిట్ బటన్ నొక్కితే… హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

-'జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్ సబ్జెక్టుల్లో సెట్ పరీక్షలు ఉంటాయి.

-కంప్యూటర్‌ ఆధారిత టెస్టు (సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి.

-పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

ఆబ్జెక్టివ్‌ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్‌–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.

ఈ పేపర్‌లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్‌ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు.

ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డి కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

Whats_app_banner