AP TET 2024 : ఏపీ 'టెట్' దరఖాస్తులు ప్రారంభం - సింపుల్ గా ఇలా అప్లై చేసుకోండి
AP TET Applications 2024 : ఏపీ టెట్ -2024 దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు అప్లికేషన్లను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు పరీక్షలు జరగనున్నాయి.
AP TET Applications 2024 : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్) దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 19వ తేదీన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ రాసేందుకు కూడా అవకాశం కల్పించారు అధికారులు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ మధ్యలో పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాలను https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
How to apply for AP TET 2024 : ఇలా అప్లై చేసుకోండి..
అర్హత గల అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://aptet.apcfss.in/ లోకి వెళ్లాలి.
Payment అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మొదటగా చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలి.
పేమెంట్ ప్రక్రియ పూర్తి అయితే లాగిన్ ఐడీ క్రియేట్ అవుతుంది.
ఈ లాగిన్ వివరాలతో మీ దరఖాస్తు ఫారమ్ ను పూర్తి చేయవచ్చు.
ఫొటో, సంతకంతో పాటు కావాల్సిన పత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
సబ్మిట్ బటన్ పై నొక్కి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి అప్లికేషన్ ఫారమ్ ను పొందవచ్చు. హాల్ టికెట్ల సమయంలో అప్లికేషన్ నెంబర్ అవసరపడుతుంది.
ముఖ్య తేదీలు:
ఏపీ టెట్ నోటిఫికేషన్ - ఫిబ్రవరి 7, 2024.
దరఖాస్తులు ప్రారంభం - ఫిబ్రవరి 8,2024.
దరఖాస్తులకు తుది గడువు - ఫిబ్రవరి 18 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు.
ఫీజు చెల్లించేందుకు ఫిబ్రవరి 17 చివరి తేదీ.
ఈ నెల 19వ తేదీన అభ్యర్థులు మాక్ టెస్ట్ రాసేందుకు అవకాశం కల్పించారు.
ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్స్‌లో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
టెట్ ప్రాథమిక కీ మార్చి 10న విడుదల చేస్తారు.
ఈ కీపై అభ్యంతరాలను మార్చి 11 వరకు స్వీకరిస్తారు.
టెట్ తుది కీని మార్చి 13న రిలీజ్ చేస్తారు.
మార్చి 14న టెట్ తుది ఫలితాలు విడుదల చేస్తారు.
డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
టెట్, డీఎస్సీ పరీక్షలను కంప్యూటర్ ఆధారంగా నిర్వహించనున్నారు.
మరోవైపు టెట్ రాసే అభ్యర్థుల అర్హతలపై కీలక ఉత్తర్వులను ఇచ్చింది ఏపీ సర్కార్. గతంలో ఉన్న పలు నిబంధనలను మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1వ తరగతి నుంచి 5 వరకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లకు నిర్వహించే టెట్-1 పేపర్‌కు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ), నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్‌ఈడీ) చేసిన వారే అర్హులని తెలిపింది. అంతేకాకుండా…. పేపర్ 1 రాసే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్ పేపర్–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధన ఉంది. దీన్ని సవరించి ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించి, డీఎస్సీ, టెట్ కలిపి 100 మార్కులకు పరీక్ష నిర్వహించారు. టీజీటీ వారికి ఇంగ్లిష్ లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు.
సంబంధిత కథనం