Telangana TET 2024 : ఏప్రిల్ లో 'టెట్' ఎగ్జామ్..! ఆ టీచర్ల వరకేనా..? అందరికా..?-telangana tet exam is likely to be held in april 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Tet 2024 : ఏప్రిల్ లో 'టెట్' ఎగ్జామ్..! ఆ టీచర్ల వరకేనా..? అందరికా..?

Telangana TET 2024 : ఏప్రిల్ లో 'టెట్' ఎగ్జామ్..! ఆ టీచర్ల వరకేనా..? అందరికా..?

Jan 03, 2024, 12:45 PM IST Maheshwaram Mahendra Chary
Jan 03, 2024, 12:45 PM , IST

  • Telangana TET Exam 2024 : టెట్ పరీక్షపై కసరత్తు చేస్తోంది తెలంగాణ విద్యాశాఖ. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందన్న నేపథ్యంలో… మరోసారి టెట్ నిర్వహించాలని సర్కార్ యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రాథమికంగా చర్చించినట్లు తెలిసింది.

ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… విద్యాశాఖపై సమీక్షించారు. ఇందులో మెగా డీఎస్సీపై ఆదేశాలు కూడా ఇచ్చారు. ప్రతి ఊరిలో బడి ఉండాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో  టీచర్లకు పదోన్నతి కల్పించడానికి టెట్‌ తప్పనిసరి అనే అంశం కూడా చర్చకు వచ్చింది. 

(1 / 5)

ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… విద్యాశాఖపై సమీక్షించారు. ఇందులో మెగా డీఎస్సీపై ఆదేశాలు కూడా ఇచ్చారు. ప్రతి ఊరిలో బడి ఉండాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో  టీచర్లకు పదోన్నతి కల్పించడానికి టెట్‌ తప్పనిసరి అనే అంశం కూడా చర్చకు వచ్చింది. (unsplash.com)

ఈ క్రమంలో మరోసారి టెట్‌ నిర్వహించాలని  ఈ సమావేశంలో నిర్వహించనట్లు తెలిస్తోంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ… ఎప్పుడు ఎగ్జామ్ నిర్వహిస్తే బాగుంటుందనే దానిపై ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం. 

(2 / 5)

ఈ క్రమంలో మరోసారి టెట్‌ నిర్వహించాలని  ఈ సమావేశంలో నిర్వహించనట్లు తెలిస్తోంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ… ఎప్పుడు ఎగ్జామ్ నిర్వహిస్తే బాగుంటుందనే దానిపై ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం. (unsplash.com)

ఏప్రిల్‌ మాసంలోనే  టెట్ పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. టెట్ ఆలస్యమైతే… డీఎస్పీ నోటిఫికేషన్ పై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

(3 / 5)

ఏప్రిల్‌ మాసంలోనే  టెట్ పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. టెట్ ఆలస్యమైతే… డీఎస్పీ నోటిఫికేషన్ పై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.(unsplash.com)

టీచర్ల పదోన్నతులకు సంబంధించి చూస్తే…  60 వేల మంది వరకు టెట్‌ పరీక్ష రాసే అవకాశం ఉంది. 2012కు ముందు టెట్‌ లేకపోవడంతో అంతకుముందే ఉన్న దాదాపు 60 వేల మంది టీచర్లకు ఈ అర్హత లేదు. టెట్‌ అర్హత ఉంటే తప్ప పదోన్నతులు కల్పించడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో… ఈ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో మరోసారి టెట్ నిర్వహించి…. పదోన్నతుల అంశాన్ని కూడా తేల్చేయాలని సర్కార్ భావిస్తోంది.

(4 / 5)

టీచర్ల పదోన్నతులకు సంబంధించి చూస్తే…  60 వేల మంది వరకు టెట్‌ పరీక్ష రాసే అవకాశం ఉంది. 2012కు ముందు టెట్‌ లేకపోవడంతో అంతకుముందే ఉన్న దాదాపు 60 వేల మంది టీచర్లకు ఈ అర్హత లేదు. టెట్‌ అర్హత ఉంటే తప్ప పదోన్నతులు కల్పించడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో… ఈ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో మరోసారి టెట్ నిర్వహించి…. పదోన్నతుల అంశాన్ని కూడా తేల్చేయాలని సర్కార్ భావిస్తోంది.(unsplash.com)

రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన విద్యార్థులు లక్షల సంఖ్యలో ఉన్నారు. మెగా డీఎస్పీపై అనేక ఆశలు పెట్టుకున్న వీరు… మరోసారి టెట్ రాసే అవకాశం కూడా ఉంది. స్కోర్ పెంచుకోవచ్చని భావిస్తున్నారు. అయితే ఏప్రిల్ లో నిర్వహించే టెట్ ను ప్రత్యేకంగా టీచర్ల కోసమే నిర్వహిస్తారా లేక అందరికి కామన్ గానే పెడుతారా అనేది కూడా తేలాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఉపాధ్యాయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

(5 / 5)

రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన విద్యార్థులు లక్షల సంఖ్యలో ఉన్నారు. మెగా డీఎస్పీపై అనేక ఆశలు పెట్టుకున్న వీరు… మరోసారి టెట్ రాసే అవకాశం కూడా ఉంది. స్కోర్ పెంచుకోవచ్చని భావిస్తున్నారు. అయితే ఏప్రిల్ లో నిర్వహించే టెట్ ను ప్రత్యేకంగా టీచర్ల కోసమే నిర్వహిస్తారా లేక అందరికి కామన్ గానే పెడుతారా అనేది కూడా తేలాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఉపాధ్యాయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.(unsplash.com)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు