Pawan Kalyan : భీమవరం(Bhimavaram)లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఇవాళ అసాధ్యమైన పొత్తును ముందుకు తీసుకెళ్లే కీలక వ్యక్తి అయ్యాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు మంగళగిరిలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...భీమవరాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనన్నారు. గత ఎన్నికల్లో తాను గెలిచి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదన్నారు. 2019 ఎన్నికల్లో ఓడినా ప్రజల గుండెల్లో బలమైన స్థానం సంపాదించానన్నారు. కుబేరులు ఉండే భీమవరం ఒక రౌడీ చేతుల్లో బందీ అయిందని ఆరోపించారు. ఒక వ్యక్తి చేసిన తప్పు అతని కులం, వర్గంపై ప్రభావం పడుతుందన్నారు. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుందన్న పవన్.. బంధుత్వాలు ఉండవని స్పష్టం చేశారు.
జనసేన(Janasena) అంతిమ లక్ష్యం వైసీపీ ప్రభుత్వాన్ని(Ysrcop Govt) మార్చడమేమని పవన్ కల్యాణ్ అన్నారు. జగన్‌కు ఆ యుద్ధం ఇద్దామన్నారు. భీమవరంలో ఉండే జగన్ జలగతో సహా వీధిరౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. దాడులపై పోరాడకపోతే మనది కూడా తప్పు అవుతుందన్నారు. జనసేన పెట్టడానికి సొంత అన్నను కాదని బయటకు వచ్చానన్నారు. భీమవరాన్ని వదలను, అది నాదే అని పవన్ అన్నారు. జనసేన గెలిస్తే భీమవరంలో డంపింగ్ యార్డ్‌ను సరిచేస్తామన్నారు. మే 15లోపు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ను చూస్తామన్నారు.
అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ బలంగా సంకల్పించకపోతే ఇవాళ బీజేపీ, టీడీపీ (TDP BJP)కలిసేవి కాదన్నారు. పవన్ కల్యాణ్ కమిట్మెంట్, జనసేన సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ నీతి నిజాయతీలతో రాజకీయం చేసే నాయకుడు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, యువతకు ఉద్యోగాలు రావాలని తపన ఆయనలో కనిపిస్తుందన్నారు. పవన్ మాటలు తనలో స్ఫూర్తి నింపాయని, అందుకే జనసేనలో చేరానన్నారు. రాష్ట్రం నుంచి రాక్షస పాలనను తరిమికొట్టాలంటే అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇవాళ మూడు పార్టీల పొత్తుకు ప్రధాన కారణం పవన్ కల్యాణ్ వివరించారు. భీమవరంలో ఐదేళ్లుగా ప్రజలు నరకం అనుభవిస్తున్నారని రామాంజనేయులు ఆరోపించారు.
సీఎం జగన్ (CM Jagan)పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అన్నారు. గత ఐదేళ్లలో తన అనుచరులపై ఎస్సీ, ఎస్టీ కేసులు సహా ఎన్నో కేసులు అక్రమంగా పెట్టారని ఆరోపించారు. తన ప్రాణం ఉన్నంత కాలం పవన్ కల్యాణ్ అడుగు జాడల్లో నడుస్తానని రామాంజనేయులు అన్నారు. తాను నలుగురు సీఎంలను చూశానని, కానీ నిజాయతీగా పాలన చేయాలని కోరుకునే ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్ అన్నారు. మనల్ని ఒక దెబ్బ కొడితే తిరిగి పది దెబ్బలు కొడతామని హెచ్చరించారు. యువత కోసమే పవన్ కల్యాణ్ నిరంతరం తపిస్తున్నారన్నారు.
సంబంధిత కథనం