YS Jagan in Vijayawda: కృష్ణా రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ ప్రారంభించిన జగన్.. ఇళ్ల పట్టాలకు సంపూర్ణ యాజమాన్య హక్కులు
YS Jagan in Vijayawda: విజయవాడ కృష్ణాతీరంలో ఆక్రమణల్ని తరచూ ముంచెత్తే వరద ముంపుకు పరిష్కారం లభించింది. ప్రభుత్వం నిర్మించిన రిటైనింగ్ వాల్స్ పూర్తి కావడంతో సిఎం జగన్ రిటైనింగ్ వాల్స్, రివర్ ఫ్రంట్ పార్కుల్ని ప్రారంభించారు.
YS Jagan in Vijayawda: దశాబ్దాలుగా కృష్ణాతీరంలో నివసిస్తున్న ప్రజల్ని వరదల్లో ముంచెత్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. కృష్ణానదిలో ఏపీ ప్రభుత్వం నిర్మించిన రిటైనింగ్ వాల్స్ Retaining Walls పూర్తి కావడంతో సిఎం జగన్ వాటిని ప్రారంభించారు.
కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్‌తో పాటు, రివర్ ఫ్రంట్ Krishna River Front డెవలప్‌మెంట్ ప్రారంభోత్సవంతో సిఎం జగన్ పాల్గొన్నారు. దీంతో పాటు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించిన పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు.
విజయవాడలో 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీల్లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇస్తున్నట్టు సిఎం Jagan తెలిపారు.
22ఏ కింద పూర్తి హక్కులు లేక, రిజిస్ట్రేషన్ Registrations చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపు 21వేల మందికి యాజమాన్య హక్కులు బదిలీ చేసినట్టు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి ఈ కార్యక్రమంలో మేలు జరుగుతోందన్నారు,.
9,125 పట్టాలు అనబ్జెక్షబుల్ ల్యాండ్స్ లో ఉన్న పట్టాలను పూర్తిగా రెగ్యులరైజ్ చేస్తున్నట్టు చెప్పారు. భ్రమరాంబపురంలో బరియల్ గ్రౌండ్ సమస్యతో ఇబ్బందికర పరిస్థితుల్లో రెగ్యులరైజ్ కాక ఇళ్లు అక్కడే కట్టుకుని, దశాబ్దాలుగా ఉంటున్నపటికీ ఇల్లు అమ్ముకునే స్వేచ్ఛ లేని పరిస్థితులు ఇకపై ఉండవన్నారు.
విజయవాడలో మొత్తం 31866 పట్టాలకు సంబంధించి రకరకాల రెగ్యులరైజేషన్ చేసినట్టు వివరించారు. రూ.239 కోట్లతో పలు ప్రాంతాల్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ వేశారు.
మురికినీళ్లు నీట్‌గా ట్రీట్ చేసి సీవేజ్ ట్రట్మెంట్ ప్లాంట్స్‌ను 5 ప్రాంతాల్లో తీసుకొస్తున్నట్టు చెప్పారు. కృష్ణా వారధికి ఇరువైలా రెండు కరకట్ట గోడలు దాదాపు రూ.500 కోట్లతో గోడలుకట్టడమే కాకుండా కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోయే అవకాశం లేదన్నారు.
కరకట్ట గోడతో కృష్ణలంక ప్రాంతంలో ఉన్న వారంతా ఆహ్లాదకరంగా సాయం త్రంపూట పార్కులో నడుచుకుని పోయేట్టుగా సుందరీకరణ చేస్తూ మంచి పార్కులు ఏర్పాటు చేశామన్నారు.
విజయవాడలో రూ.400 కోట్లు ఖర్చు పెట్టి అంబేడ్కర్ పార్కుకు ఫౌండేషన్ స్టోన్ వేసి పనులు పూర్తి చేసి విగ్రహాన్ని ఇప్పటికే ప్రారంభించామన్నారు.
విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు పోవాలంటే ఒక్క ఫ్లై ఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితిలో 58 నెలల కాలంలోనే రెండు ఫ్లై ఓవర్లు అదే రోడ్డులో వచ్చాయన్నారు. కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ నిర్మాణం కూడా పూర్తైందని చెప్పారు.
ఔటర్ రింగు రోడ్లు, కాజ నుంచి చిన్న అవుటు పల్లెకు గుంటూరు ట్రాఫిక్ అంతా విజయవాడ నుంచి పోవాల్సిన అవసరం లేకుండా అటు నుంచి అటే ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్టు కూడా పూర్తైందని, రెండు నెలల్లో ఓపెన్ చేసే విధంగా పనులు జరుగుతున్నాయన్నారు.
కృష్ణా వారధికి ఇరువైపులా నిర్మించిన పార్కులకు కృష్ణమ్మ జలవిహార్ అని పేరు పెడుతున్నట్టు ప్రకటించారు. విజయవాడలో తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల్ని గెలిపించాలని సిఎం జగన్ విజ్ఞప్తి చేశారు.