West Godavari News : దేవుడి మెడలో వైసీపీ కండువా, అవాక్కైన భక్తులు!
దేవుడి మెడలో వైసీపీ కండువా: పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు వినాయక ఆలయంలో పూజలు చేస్తుండగా... పూజారి దేవుడికి వైసీపీ కండువా కప్పారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.
West Godavari News : రాజకీయ నాయకులకు(Political Leaders) కండువాలు చాలా ముఖ్యం. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో? ఏ పార్టీలోకి జంప్ చేస్తారో? అది ఆ దేవుడికే తెలియాలి. అయితే ఎన్నికల పండుగ వస్తే మాత్రం రాజకీయ నాయకులు కండువాల మార్పు ఆట ఆడేస్తుంటారు. ఉన్న పార్టీలో టికెట్ రాకపోతే అసంతృప్తి ట్యాగ్ తో రాత్రికి రాత్రే పార్టీ మార్చేస్తుంటారు. పార్టీ కండువా వేసుకున్న నేతతో పాటు.. ఆ కండువాకు కూడా కాస్త గుర్తింపు ఉంటుంది. అధికార పార్టీ కండువా మేడలో ఉంటే... అదొక రాజముద్రే. అనధికారంగా కొన్ని పనులు జరిగిపోతుంటాయి. పార్టీ కండువా డిజైన్ లో నైపుణ్యం తప్పనిసరి. పార్టీ సింబల్, రంగు, అధినేత ఫొటో ఇలా అన్ని కండువాలో ఉండాల్సిందే. గతంలో మూడు రంగుల కండువా, కాషాయ కండువాలే కనిపించేవి. ఇప్పుడు గల్లీకో పార్టీతో ఇంటికో కండువా కనిపిస్తుంది. అసలేందుకీ కండువా పురాణం అనుకుంటున్నారా?
దేవుడికి పార్టీ కండువా కప్పి పూజలు?
రాజకీయ నేతలు ప్రచారానికి వస్తే ప్రజలతో ఊర్లో ఉన్న దేవుళ్లను కూడా పలకరిస్తుంటారు. ఇలా ఓ రాజకీయ నేత ఓ ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడున్న ఓ దేవాలయానికి వెళ్తే అక్కడి పూజారి పొరపాటునో, ఏదో దృష్టిలోనే చేసిన పని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో(Social Media Viral) వైరల్ అవుతుంది. పూజారి ఓ పార్టీ కండువాను దేవుడికి అలంకరించారు. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. దేవుడికి కూడా రాజకీయ రంగు పులుముతున్నారా? అంటూ ఓ సెక్షన్ సామాజిక మీడియా వాదులు విమర్శలు మొదలుపెట్టారు. కావాలని చేసింది కాదని, పొరపాటున ఇలా జరిగి ఉంటుందని మరో వర్గం వాదిస్తుంది.
చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు ప్రచారంలో ఘటన
ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఎన్నికలు ప్రచారం(Election Campaign) మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గంలోని పెనుగొండ మండలం సిద్ధాంతం(Siddhantam) గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఆ గ్రామంలోని వినాయకుడిని దర్శించుకుని, పూజలు చేయాలనుకున్నారు. ఈ క్రమంలో పూజలు నిర్వహిస్తుండగా ఆలయ పూజారి...మాజీ మంత్రి రంగనాథరాజుకు స్వాగతం పలికి పూజా కార్యక్రమానికి అంతా సిద్ధం చేశారు. అర్చనకు తెచ్చిన పండ్లు, పువ్వులు, వస్త్రాలు భగవంతుడు ముందు ఉంచి పూజలు చేశారు. సాధారణంగా రాజకీయ నాయకులు దేవాలయాలకు వస్తే... వాళ్లు తెచ్చిన దండలను దేవుడు మెడలో లేదా పాదాల వద్ద ఉంచి తిరిగి ఆ నేతల మెడలో వేస్తారు. పూజ పూర్తైన తర్వాత పూలు, పండ్లు ఇచ్చి దేవుని వస్త్రంతో వారికి ఆశీర్వచనాలు ఇస్తారు.
వీడియో వైరల్
మాజీ మంత్రి రంగనాథరాజు(Cherukuvada Ranganath Raju) పూజ నిర్వహిస్తున్న సమయంలో ఆయన వైసీపీ కండువా పట్టుకున్నారు. దానిని పొరపాటు దేవుడికి సమర్పించడానికి తెచ్చిన వస్త్రం అనుకుని పూజారి... దేవుడికి అలంకరించి పూజలు (Ysrcp Towel on God)చేశారు. దీనిని గమనించిన రంగనాథరాజు కండువాను దేవుని పాదాల వద్ద ఉంచి పూజ చేయాలని కోరారు. పూజ అనంతరం ఆ కండువాను అర్చకుడు రంగనాథరాజు మెడలో వేశారు. ఆయనకు ఆశీర్వనచం చేశారు. అయితే పూజారి దేవుని మెడలో వైసీపీ కండువా(Ysrcp Hand Towel) వేసిన వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. దీంతో దేవుడికి కూడా వైసీపీ కండువాలు కప్పుతున్నారంటూ విమర్శలు మొదలయ్యాయి.
సంబంధిత కథనం