AP TG GST Returns : ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో జీఎస్టీ వ‌సూళ్లు ఎంత? వ‌చ్చిన‌ ప‌రిహారం ఎంత‌?-how much gst compensation did andhra pradesh and telangana receive ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tg Gst Returns : ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో జీఎస్టీ వ‌సూళ్లు ఎంత? వ‌చ్చిన‌ ప‌రిహారం ఎంత‌?

AP TG GST Returns : ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో జీఎస్టీ వ‌సూళ్లు ఎంత? వ‌చ్చిన‌ ప‌రిహారం ఎంత‌?

HT Telugu Desk HT Telugu
Nov 02, 2024 03:22 PM IST

AP TG GST Returns : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ.3,815 కోట్లు, తెలంగాణ‌లో రూ.5,211 కోట్లు జీఎస్టీ వ‌సూలు అయిన‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.2024 అక్టోబ‌ర్ వ‌ర‌కు ఎస్‌జీఎస్‌టీ నిధులు ఆంధ్రప్ర‌దేశ్‌కు రూ.19,171 కోట్లు ఇచ్చిన‌ట్లు, తెలంగాణ‌కు రూ.25,306 కోట్లు ఇచ్చిన‌ట్లు తెలిపింది.

ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో జీఎస్టీ వ‌సూళ్లు
ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో జీఎస్టీ వ‌సూళ్లు

అక్టోబ‌ర్- 2024 కు సంబంధించిన జీఎస్టీ వ‌సూలు దేశ‌వ్యాప్తంగా రూ.1,42,251 కోట్లు వ‌సూలు అయ్యాయ‌ని, గ‌తేడాది అక్టోబ‌ర్‌లో రూ.1,28,582 కోట్లు వ‌సూలు అయ్యాయ‌ని కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఏకంగా 10.63 శాతం వ‌సూళ్లు పెరిగాయ‌ని వెల్లడించింది.

ఏపీలో 12, తెలంగాణ‌లో 7 శాతం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌తేడాది అక్టోబ‌ర్ రూ.3,493 కోట్లు వ‌సూలు కాగా, ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో రూ.3,815 కోట్లు పెరిగింద‌ని, పెరుగుద‌ల 12 శాతం న‌మోదు అయింద‌ని కేంద్రం తెలిపింది. తెలంగాణ‌లో గ‌తేడాది అక్టోబ‌ర్‌లో రూ.4,868 కోట్లు వ‌సూలు కాగా, ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో రూ.5,211 కోట్లు వ‌సూలు అయింద‌ని, పెరుగుద‌ల 7 శాతం న‌మోదు అయింద‌ని పేర్కొంది.

ఎస్‌జీఎస్‌టీ నిధులు ఇలా..

ఈ ఏడాదిలో అక్టోబ‌ర్ వ‌ర‌కు ఎస్‌జీఎస్‌టీ నిధులు ఆంధ్రప్ర‌దేశ్‌కు రూ.19,171 కోట్లు ఇచ్చిన‌ట్లు, తెలంగాణ‌కు రూ.25,306 కోట్లు ఇచ్చిన‌ట్లు పేర్కొంది. ఏపీకి గ‌తేడాది అక్టోబ‌ర్ వ‌ర‌కు రూ.18,488 కోట్లు ఎస్‌జీఎస్‌టీ నిధులు ఇవ్వ‌గా, ఈ ఏడాది నాలుగు శాతం నిధులు పెరిగాయి. తెలంగాణ‌ల‌కు గ‌తేడాది అక్టోబ‌ర్ వ‌ర‌కు రూ.23,478 కోట్లు ఇవ్వ‌గా, ఈ ఏడాది ఎనిమిది శాతం నిధులు పెరిగాయి.

దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ఈ ఏడాది అక్టోబ‌ర్ వ‌ర‌కు రూ.5,555,227 కోట్లు సీజీఎస్‌టీ నిధుల‌ను విడుద‌ల చేసింది. గ‌త ఏడాది అక్టోబ‌ర్ వ‌ర‌కు రూ.4,97,562 కోట్ల‌ను విడుద‌ల చేసింది. అంటే గ‌తేడాది కంటే, ఈ ఏడాది 12 శాతం సీజీఎస్‌టీ నిధులను విడుద‌ల చేసింది.

ఏప్రిల్ నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు..

ఆంధ్రప్ర‌దేశ్‌లో 2024 ఏప్రిల్ నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు సెంట్ర‌ల్ పూల్ కింద 1,76,254 జీఎస్‌టీ ఖాతాల నుంచి సీజీఎస్‌టీ రూ. 3,478 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ. 4,449 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.5,421 కోట్లు, సెస్ రూ.1,631 కోట్లు, మొత్తం రూ.14,980 కోట్లు వ‌సూలు అయింది. స్టేట్ పూల్ కింద 2,44,326 జీఎస్‌టీ ఖాతాల నుంచి సీజీఎస్‌టీ రూ. 3,122 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ. 3,967 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.4,165 కోట్లు, సెస్ రూ.124 కోట్లు, మొత్తం రూ.11,377 కోట్లు వ‌సూలు అయింది.

మొత్తం సెంట్ర‌ల్‌, స్టేట్ పూల్ కింద సీజీఎస్‌టీ రూ. 6,600 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ. 8,416 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.9,586 కోట్లు, సెస్ రూ.1,755 కోట్లు, మొత్తం రూ.26,357 కోట్లు వ‌సూలు అయింది. ఏపీలో సెంట్ర‌ల్ పూల్ కింద 3.5 శాతం, స్టేట్ పూల్ కింద 4.9 శాతం, మొత్తంగా 4.1 శాతంగా జీఎస్‌టీ వ‌సూళ్లు పెరిగాయి.

తెలంగాణ‌లో..

తెలంగాణ‌లో 2024 ఏప్రిల్ నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు సెంట్ర‌ల్ పూల్ కింద 2,23,832 జీఎస్‌టీ ఖాతాల నుంచి సీజీఎస్‌టీ రూ. 4,571 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ. 5,599 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.4,896 కోట్లు, సెస్ రూ.2,662 కోట్లు, మొత్తం రూ.17,729 కోట్లు వ‌సూలు అయింది. స్టేట్ పూల్ కింద 3,09,097 జీఎస్‌టీ ఖాతాల నుంచి సీజీఎస్‌టీ రూ. 5,051 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ. 6,490 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.5,743 కోట్లు, సెస్ రూ.952 కోట్లు, మొత్తం రూ.18,195 కోట్లు వ‌సూలు అయింది.

మొత్తం సెంట్ర‌ల్‌, స్టేట్ పూల్ కింద సీజీఎస్‌టీ రూ. 9,581 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ.12,089 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.10,639 కోట్లు, సెస్ రూ.3,615 కోట్లు, మొత్తం రూ.35,924 కోట్లు వ‌సూలు అయింది. ఏపీలో సెంట్ర‌ల్ పూల్ కింద 7.3 శాతం, స్టేట్ పూల్ కింద 3.2 శాతం, మొత్తంగా 5.2 శాతంగా జీఎస్‌టీ వ‌సూళ్లు పెరిగాయి.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner