AP TG Weather Updates : బలహీనపడిన ఉపరితల ఆవర్తనం - ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు..!-ap telangana will receive light to moderate rains for three days imd latest weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : బలహీనపడిన ఉపరితల ఆవర్తనం - ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు..!

AP TG Weather Updates : బలహీనపడిన ఉపరితల ఆవర్తనం - ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు..!

Published Nov 02, 2024 06:41 AM IST Maheshwaram Mahendra Chary
Published Nov 02, 2024 06:41 AM IST

  • AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలో మరో మూడు నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములతో కూడిన వానలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది. శుక్రవారం హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది. దీంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. 
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం బలహీన పడినట్లు వాతావరణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

(1 / 7)

ఏపీలో ఇవాళ (నవంబర్ 2, 2024) విజయనగరం,మన్యం,అల్లూరి,అనకాపల్లి,ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్,పల్నాడు,నెల్లూరు,శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్,అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

(2 / 7)

రేపు, ఎల్లుండి కూడా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు సీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని పేర్కొంది.

(3 / 7)

తెలంగాణలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అకడకక్కడ కురిసే అకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.  

(4 / 7)

నవంబర్ 6వ తేదీ వరకు తెలంగాణలో ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. నవంబర్ 7వ తేదీ నుంచి పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేసింది.  

(5 / 7)

శుక్రవారం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. .జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్, కొండాపూర్‌, కొత్తగూడ, మియాపూర్‌, మెహిదీపట్నం, మలక్‌పేట్‌, చార్మినార్‌ తో పాటు పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది.  భారీ వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 

(6 / 7)

ఇవాళ కూడా హైదరాబాద్ నగరంలో సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.

(7 / 7)

ఇతర గ్యాలరీలు