Fighter Collection: ఫైటర్ కలెక్షన్స్ - వరుసగా 100 కోట్ల వసూళ్లు సాధించిన హృతిక్ రోషన్ 14వ మూవీగా రికార్డ్
Fighter Collection: హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. రెండు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. హృతిక్ కెరీర్‌లో వంద కోట్ల వసూళ్లను సాధించిన 14వ మూవీగా ఫైటర్ రికార్డ్ క్రియేట్ చేసింది.
Fighter Collection: హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. హృతిక్ కెరీర్‌లో వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన 14వ మూవీగా ఫైటర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అగ్నిపథ్, కాబిల్ తర్వాత రిపబ్లిక్ డే రోజున విడుదలై 100 కోట్ల గ్రాస్ సాధించిన హృతిక్ రోషన్ హ్యాట్రిక్ మూవీగా ఫైటర్ నిలిచింది. ఓవర్సీస్ లో ఫైటర్ వసూళ్లతో దుమ్మురేపుతోంది. ఫస్ట్ డేనే 40 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. వార్ తర్వాత సింగిల్ డే లో ఈ ఘనతను సాధించిన హృతిక్ రోషన్ రెండో మూవీగా ఫైటర్ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియాలోనూ హృతిక్ కెరీర్ లో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న మూవీగా ఫైటర్ నిలిచింది.
వరుసగా పదో మూవీ...
హృతిక్ రోషన్ కెరీర్ లో వరుసగా వంద కోట్ల క్లబ్‌లో చేరిన పదో మూవీగా ఫైటర్ రికార్డ్ సృష్టించింది. 2001లో కభీ ఖుషి కభీ గమ్ సినిమా హృతిక్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ వంద కోట్లు సాధించిన మూవీగా నిలిచింది. ఆ తర్వాత అతడు నటించిన 14 సినిమాలు వంద కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నాయి.
నాలుగో రోజు అడ్వాన్స్ బుకింగ్స్...
నాలుగో రోజు కూడా ఈ మూవీ భారీగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఆదివారం రోజుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ 9.28 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఫస్ట్ డే సమానంగా ఆదివారం రోజు ఫైటర్ మూవీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
ఎయిర్ ఫోర్స్ బ్యాక్‌డ్రాప్...
ఎయిర్ ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధార్థ్ ఆనంద్ మూవీని తెరకెక్కించాడు. దేశ రక్షణ కోసం ఎయిర్స్ ఫోర్ట్ ఎలాంటి పోరాటం సాగిస్తుందన్నది యాక్షన్ అంశాలతో ఈ సినిమాలో చూపించాడు.
ఫైటర్ సినిమాలో పాటీ అనే పాత్రలో హృతిక్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు. ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో హృతిక్‌పై తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తోన్నాయి.ఈ సినిమాలో దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటించింది. హృతిక్, దీపికా కెమిస్ట్రీ, రొమాంటిక్ ట్రాక్స్ యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. హృతిక్ రోషన్, దీపికా పడుకోణ్ కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ ఇదే కావడం గమనార్హం.
స్క్వాడ్రాన్ లీడర్..
వైమానిక దళంలో స్క్వాడ్రాన్ లీడర్‌గా పనిచేసే పాటీ ఓ తప్పు చేసి రెండేళ్లు విధులకు ఎందుకు దూరమవ్వాల్సివచ్చింది. తిరిగి డ్యూటీలో జాయిన్ అయిన అతడు దేశ రక్షణ కోసం ఎలాంటి పోరాటం సాగించాడన్నది ఫైటర్ మూవీ కథ. ఫైటర్‌లో అనిల్‌కపూర్, అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషించారు. ఫైటర్ తర్వాత హృతిక్ రోషన్ వార్ 2 మూవీ చేయబోతున్నాడు.ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీకి బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నాడు. 2019లో రిలీజైన వార్ మూవీకి సీక్వెల్‌గా వార్ 2 తెరకెక్కుతోంది.