Bird Flu Terror: పౌల్ట్రీపై బర్డ్‌ ఫ్లూ టెర్రర్... విస్తరిస్తున్న పుకార్లు, పట్టించుకోని ప్రభుత్వం-bird flu terror on poultry spreading rumors ignored by government ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bird Flu Terror: పౌల్ట్రీపై బర్డ్‌ ఫ్లూ టెర్రర్... విస్తరిస్తున్న పుకార్లు, పట్టించుకోని ప్రభుత్వం

Bird Flu Terror: పౌల్ట్రీపై బర్డ్‌ ఫ్లూ టెర్రర్... విస్తరిస్తున్న పుకార్లు, పట్టించుకోని ప్రభుత్వం

Sarath chandra.B HT Telugu
Feb 19, 2024 09:34 AM IST

Bird Flu Terror: బర్డ్‌ఫ్లూ పుకార్లు ఏపీలోని అన్ని ప్రాంతాల్లో విస్తరిస్తున్నా వాటిని కట్టడి చేసే చర్యలు మాత్రం కొరవడ్డాయి. నెల్లూరు జిల్లాలో ఫిబ్రవరి మొదటి వారంలో కోళ్లు చనిపోవడానికి బర్డ్‌ ఫ్లూ కారణమని నిర్ధారణ కావడంతో అది మొత్తం పౌల్ట్రీ రంగానికి శాపంగా మారింది.

 బర్డ్‌ఫ్లూపై ప్రకటనతో సరిపెట్టుకున్న  ఏపీ ప్రభుత్వం
బర్డ్‌ఫ్లూపై ప్రకటనతో సరిపెట్టుకున్న ఏపీ ప్రభుత్వం (unsplash)

Bird Flu Terror: పౌల్ట్రీ రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న తరుణంలో అనూహ్యంగా బర్డ్‌ ఫ్లూ వార్తలు వ్యాపించడం రైతుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. నెల్లూరులో రెండు మండలాల్లో కోళ్లు చనిపోతే దాని ప్రభావం ఏపీలోని చాలా జిల్లాలపై పడింది. ఫిబ్రవరి 5వ తేదీన వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. ఆ తర్వాత పది రోజులకు భోపాల్‌ పరిశోధన కేంద్రం బర్డ్‌ ఫ్లూని నిర్ధారించింది.

నెల్లూరు జిల్లాలో గత వారమే ఆంక్షలు విధించినా వార్తల్ని మాత్రం కట్టడి చేయలేకపోయారు. ప్రతి జిల్లాలో అయా ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయని ప్రచారం మొదలు పెట్టారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఈ తరహా ‎ఘటనలు జరగకపోయినా అన్ని ప్రాంతాల్లో ఈ తరహా పుకార్లు వ్యాపించాయి.

గత రెండు వారాలుగా కోడి మాంసం ధరలు కేజీ రూ.260వరకు చేరాయి. బర్డ్ ఫ్లూ వార్తలు మొదలైన తర్వాత చాలా ప్రాంతాల్లో జనం చికెన్ జోలికి పోవడానికి భయపడుతున్నారు. కొంత కాలం చికెన్ తినకుండా ఉండటమే ఉత్తమం అని భావిస్తున్నారు. దీంతో ధరలు కూడా అమాంతం పడిపోతున్నాయి. ఏటా ఏదొక రూపంలో పౌల్ట్రీ పరిశ్రమకు ఇబ్బందులు తప్పడం లేదని రైతులు, వ్యాపారులు ఆరోపిస్తున్నారు.

నెల్లూరుకే పరిమితమా…?

ఈ నెల5వ తేదీన నెల్లూరు జిల్లాలో బర్డ్‌ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు Chicken మృత్యవాత పడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో బర్డ్‌ఫ్లూగా తేలడంతో రెండు మండలాల్లో అధికారులు ఆంక్షలు Retrictions విధించారు.

జిల్లాలోని చాటగుట్ల Chatagutla, గుమ్మళ్ళదిబ్బ Gummalladibbaలో బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. కోళ్ల కళేబరాల నుంచి శాంపిల్ Samples సేకరించి భోపాల్ Bhopal లోని టెస్టింగ్ కేంద్రానికి పంపిన పశుసంవర్ధక శాఖ అధికారులు..బర్డ్‌ ఫ్లూ‌గా ఫలితాలు రావడంతో అప్రమత్తం అయ్యారు. కోళ్లు మృతిచెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధి లో 3 రోజులపాటు చికెన్ షాపులు మూసివేయాలని, కిలోమీటర్ పరిధిలో ఉన్న చికెన్ షాప్స్ మూడు నెలల పాటు మూసేయ్యాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

పొదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ గ్రామాల్లో ఇటీవల ఏవీఏఎన్‌ ఇన్‌ఫ్లూయోంజాతో కోళ్లు పెద్ద ఎత్తున చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. చనిపోయిన కోళ్ల నమూనాలను పశుసంవర్థక శాఖ అధికారులు భోపాల్‌లోని పరీక్షా కేంద్రాలకు పంపారు. ఇన్‌‌ఫ్లూయెంజా Influenza నిర్ధారించడంతో వ్యాధి ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాధి ప్రబలిన ప్రాంతాల నుంచి 15రోజుల వరకు కోళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, బయట నుంచి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

నెల్లూరులో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోవడంపై మొదట విజయవాడలో పరిశోధనలు నిర్వహించారు. అక్కడ వెలువడిన ఫలితాలపై అనుమానం వచ్చిన రీసెర్చ్‌ ల్యాబ్‌ అధికారులు రక్త నమూనాలను భోపాల్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌ ((NIHSAD)) పంపించారు. అక్కడ చేసిన పరీక్షల్లో బర్డ్‌ఫ్లూగా నిర్థారించి రిపోర్టులను గత గురువారం విజయవాడకు పంపించారు. బ

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక చదరపు కిలో మీటరు పరిధిలో వెయ్యి కోళ్లు ఉంటే ఆ జిల్లాలను ‘ఎ’ కేటగిరీ జిల్లాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఏపీలో అటువంటి జిల్లాలు మూడు ఉన్నాయి. అవి ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోపెద్ద సంఖ్యలో బ్రీడింగ్ కేంద్రాలు, హేచరీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో ఇతర ప్రాంతాలకు ఇక్కడి నుంచి కోళ్లు ఎగుమతి అవుతుంటాయి.

బర్డ్‌ ఫ్లూ వార్తలపై గత వారం పశు సంవర్ధక శాఖ ఓ ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఆందోళన చెందాల్సిన పని లేదని పరిస్థితి అదుపులోనే ఉందని ప్రకటించారు. పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, ఆ శాఖ మంత్రి ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో పుకార్లు విస్తృతంగా వ్యాపించాయి. పౌల్ట్రీకి పరిశ్రమ గాడిన పడుతుందనుకున్న సమయంలో బర్డ్‌ ఫ్లూ పుకార్లను అదుపు చేయాల్సిన శాఖలు పట్టనట్టు వ్యవహరించడంపై పరిశ్రమపై ఆధారపడిన వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి విషయంలో ప్రభుత్వం స్ఫష్టత ఇవ్వాలని రైతులు, వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.

Whats_app_banner