Bird Flu in Nellore : కోళ్లకు వచ్చిన వ్యాధి గుర్తింపు..! బర్డ్‌ఫ్లూపై ఏపీ సర్కార్ ప్రకటన
Bird Flu in Nellore District:నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కోళ్లకు వచ్చిన వ్యాధి ఏవియన్ ఇన్ఫ్లూయాంజగా గుర్తించింది.
Bird Flu in Nellore District:నెల్లూరు జిల్లాలోని బర్డ్‌ఫ్లూపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. కోళ్లకు వచ్చిన వ్యాధి ఏవియన్ ఇన్ఫ్లూయాంజగా(Avian influenza) గుర్తించినట్లు వెల్లడించింది. జిల్లాలోని రెండు గ్రామాల్లో తప్ప ఈ వ్యాధి రాష్ట్రంలో ఎక్కడా లేదని తెలిపింది. 712 ర్యాపిడ్ టీమ్స్ మానిటర్ చేస్తున్నాయని… ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
భోపాల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ కు శాంపిల్స్ పంపామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. పరీక్షల్లో ఇది ఏవియన్ ఇన్ ఫ్లూయెంజ్ (ఏవియన్ ఫ్లూ)గా తేలిందని ప్రకటించింది. కోళ్లు చనిపోయిన గ్రామాలకు కిలోమీటర్ దూరంలో ఇన్పెక్టెడ్ జోన్ గా ప్రకటించామని వివరించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
ఏం జరిగిందంటే…?
నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ(Bird Flu in Nellore) కలకలం రేగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. జిల్లాలోని చాటగుట్ల Chatagutla, గుమ్మళ్ళదిబ్బ Gummalladibbaలో బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. కోళ్ల కళేబరాల నుంచి శాంపిల్ Samples సేకరించి భోపాల్ Bhopal లోని టెస్టింగ్ కేంద్రానికి పంపిన పశుసంవర్ధక శాఖ అధికారులు..బర్డ్ ఫ్లూగా ఫలితాలు రావడంతో అప్రమత్తం అయ్యారు.కోళ్లు మృతిచెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధి లో 3 రోజులపాటు చికెన్ షాపులు మూసివేయాలని, కిలోమీటర్ పరిధిలో ఉన్న చికెన్ షాప్స్ మూడు నెలల పాటు మూసేయ్యాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారుల్ని గురువారం ఆదేశించారు. నెల్లూరు క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పొదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ గ్రామాల్లో ఇటీవల ఏవీఏఎన్ ఇన్‌ఫ్లూయోంజాతో కోళ్లు పెద్ద ఎత్తున చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. చనిపోయిన కోళ్ల నమూనాలను పశుసంవర్థక శాఖ అధికారులు భోపాల్‌లోని పరీక్షా కేంద్రాలకు పంపారు. ఇన్‌ఫ్లూయెంజా Influenza నిర్ధారించడంతో వ్యాధి ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు చికెన్ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. కిలోమీటర్ పరిధిలో మూడు నెలలు దుకాణాలు తెరవొద్దని ఆదేశించారు.
బర్డ్ ఫ్లూ వ్యాపించిన కిలో మీటర్ పరిధిలో మూడు నెలల వరకు షాపులు తెరవకూడదని,కోళ్లతో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలని వ్యాధి ప్రబలిన 2 గ్రామాల్లో డీపీవో, జిల్లా పరిషత్ సీఈవో గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్ షాప్ యజమానుల్లో చైతన్యం తేవాలని ఆయా గ్రామాల పరిధిలో శానిటైజేషన్ చేయించాలని కలెక్టర్ సూచించారు. వ్యాధిని గుర్తించటంతో తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ సర్కార్ దృష్టి పెట్టిెంది. ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అసరం లేదని సూచించింది.
సంబంధిత కథనం