AP Group 1 Results : గ్రూపు-1 మెయిన్స్ ఫలితాలు విడుదల - ఇంటర్వూలు ఎప్పుడంటే..?-appsc group 1 mains results announced check the details are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Group 1 Results : గ్రూపు-1 మెయిన్స్ ఫలితాలు విడుదల - ఇంటర్వూలు ఎప్పుడంటే..?

AP Group 1 Results : గ్రూపు-1 మెయిన్స్ ఫలితాలు విడుదల - ఇంటర్వూలు ఎప్పుడంటే..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 14, 2023 03:50 PM IST

APPSC Group 1 Results:ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు వచ్చేశాయ్. మొత్తం 259 మంది ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో ఉంచారు.

ఏపీపీఎస్సీ గ్రూప్ - 1
ఏపీపీఎస్సీ గ్రూప్ - 1

APPSC Group 1 Results: ఏపీ గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. జూన్ 3 నుంచి 10వ తారీఖు వరకు జరిగిన మెయిన్స్ పరీక్షలకు మొత్తం 5035 మంది హాజరైన సంగతి తెలిసిందే. వీరిలో 259 మంది ఇంటర్వ్యూకి అర్హత సాధించినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 111 పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీ గతేడాది సెప్టెంబర్ 30న గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకుగాను మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 8న... 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రాథమిక పరీక్షకు 82.38శాతం మంది హాజరయ్యారు. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించిన అధికారులు... అందరినీ ఆశ్చర్యపరుస్తూ... రికార్డు స్థాయిలో 20 రోజుల్లోనే ప్రిలిమ్స్ రిజల్ట్స్ వెలువరించారు. 1 : 50 పద్ధతిలో ఫలితాలు వెల్లడించిన ఏపీపీఎస్సీ... 6,455 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. వీరికి మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన కమిషన్.... కేవలం 34 రోజులలోనే ఫలితాలను ప్రకటించింది. ఇంటర్వూలకు అర్హత సాధించిన వారి వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.

భర్తీ చేసే పోస్టుల వివరాలు:

డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు - 1

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 1

డిప్యూటీ కలెక్టర్ పోస్టులు - 10

అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు - 12

డిప్యూటీ సూపరింటెండెంట్‌ పోస్టులు - 13

డివిజనల్/డిస్ట్రిక్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులు - 2

అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్‌ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు - 8

రీజనల్‌ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్‌ పోస్టులు - 2

మండల పరిషత్ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు - 7

జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు - 3

జిల్లా గిరిజన సంక్షేమ ఆఫీసర్‌ పోస్టులు - 1

జిల్లా బీసీ సంక్షేమ ఆఫీసర్‌ పోస్టులు - 2

మున్సిపల్ కమీషనర్ గ్రేడ్-II పోస్టులు - 6

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/లే సెక్రెటరీ అండ్‌ ట్రెజర్‌ గ్రేడ్-II పోస్టులు - 18

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు - 4

Whats_app_banner

సంబంధిత కథనం