APPSC : అలర్ట్... ఆగస్టు 18 నుంచి ఏపీపీఎస్సీ నియామక పరీక్షలు - షెడ్యూల్ ఇదే
Andhra Pradesh Public Service Commission: ఉద్యోగ అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీపీఎస్సీ. పలు ఉద్యోగ నియామక పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
APPSC Exam Dates: పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పటికే నోటిఫికేషన్లు ఇవ్వగా... తాజాగా రాత పరీక్ష తేదీలను ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం పరీక్ష షెడ్యూల్ ను ఖరారు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్, నాన్-గెజిటెడ్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ తో పాటు ఇతర ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌లు అనుసరించి కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 18 నుంచి 22వ తేదీ మధ్య నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది.
పరీక్షల షెడ్యూల్ :
-టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ - పరీక్ష తేదీ 18- 08 - 2023.
-కంప్యూటర్ డ్రాట్స్ మెన్ - పరీక్ష తేదీ -19--8- 2-2023.
-నాన్ గెజిటెడ్ పోస్టు, శాంపిల్ టేకర్ - పరీక్ష తేదీ - 19-08-2-2023.
-అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ - 21-08-2023.
ఇక ఉదయం పేపర్ -1 పరీక్ష ఉండగా… మధ్యాహ్నం సంబంధిత సబ్జెక్ట్ పరీక్ష ఉంటుంది. ఉదయం పరీక్ష 09.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఇక మధ్యాహ్నం పరీక్ష టైం చూస్తే…. 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు ఉటంటుంది.
APPSC Group 2 Syllabus: త్వరలోనే ఏపీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో గ్రూప్-2 సిలిబస్ కు సంబంధించి ఇప్పటికే అప్డేట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పలు మార్పులు చేస్తూ కొత్త సిలబస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాత పరీక్షల ద్వారా భర్తీ ప్రక్రియను చేపట్టనుంది. మొదటగా స్క్రీనింగ్ పరీక్ష తర్వాత... రెండో దశలో మెయిన్స్ నిర్వహించనున్నారు.
కొత్తగా ప్రకటించిన సిలబస్ ప్రకారం… 150 మార్కులకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.ఇందులో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు ఒక్కో సెక్షన్ కు 30 మార్కులు కేటాయించారు. ఇందులో అర్హత సాధిస్తేనే మెయిన్స్ కు అర్హులు అవుతారు..మెయిన్స్‌లో మొత్తం 2 పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు.