TSPSC Group 1: జులై మొదటివారంలో గ్రూప్ - 1 ప్రిలిమ్స్ ఫలితాలు!నవంబర్‌లో 'మెయిన్స్'
TSPS Group 1 Prelims Results: గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫలితాలు త్వరలోనే రానున్నాయి. రేపోమాపో కీ విడుదల చేయాలని భావిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్… జూలై మొదటి వారంలో ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
TSPS Group 1 Exam Latest Updates: పేపర్ లీక్ కారణంగా రద్దు చేసిన పరీక్షల విషయంలో వేగం పెంచింది తెలంగాణ పబ్లిక్ సర్వీక్ కమిషన్. ఇప్పటికే పలు పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించగా... కొన్నింటిని నిర్వహించింది. ఎంతో కీలకమైన గ్రూప్ - 1 పరీక్ష రద్దు కాగా.... మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించారు. రేపో మాపో(సోమ లేదా మంగళ) ప్రాథమిక కీ ని విడుదల చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. ఇదే సమయంలో.... తుది ఫలితాలను జులై మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మెయిన్స్ పరీక్షలపై కూడా ఫోకస్ పెట్టిన కమిషన్…. నవంబరులో నిర్వహించాలని యోచిస్తోంది.
మెయిన్స్ జాబితా…
జూన్ 25 లేదా 26 తేదీల్లో ప్రిలిమ్స్ కీ వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా కమిషన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష జరగ్గా.... ఇప్పటికే ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మెయిన్స్ పరీక్షలపై కూడా దృష్టి పెట్టింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. నవంబర్‌లో పరీక్షలను నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి... తాజాగా భేటీ అయిన కమిషన్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు, మెయిన్స్ నిర్వహణ, కొత్త పరీక్ష తేదీల ప్రకటన తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. కీ విడుదల చేయటం కాకుండా... అభ్యంతరాలను కూడా స్వీకరించేందుకు కొంత గడువు ఇచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే ఫలితాలు రానున్నాయి. ఫలితంగా జులై మొదటి వారంలో మెయిన్స్ కు అర్హత సాధించిన వారి జాబితా విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 2,33,248 మంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన సంగతి తెలిసిందే.
గ్రూప్ - 4 హాల్ టికెట్లు…
TSPSC Group 4 Hall tickets : తెలంగాణ గ్రూప్-4 పరీక్షకు టీఎస్పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తు్న్నారు. జులై 1న నిర్వహించే గ్రూప్-4(Group-4) పరీక్షకు హాల్ టికెట్లు విడుదల చేశారు. హాల్ టికెట్ల టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జులై 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,180 గ్రూప్-4 పోస్టులకు గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్-4 పోస్టులకు మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
గ్రూప్-4 సర్వీసు పోస్టులకు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ చరిత్రలో ఈ స్థాయిలో దరఖాస్తు చేయడం ఇది రెండోసారి అని అధికారులు తెలిపారు. 2018లో 700 వీఆర్వో ఉద్యోగాలకు 10.58 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో 7.9 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జిల్లా స్థాయిలో పోస్టులు కావడంతో పోటీపడుతున్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. గ్రూప్-4 పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబరు 2న నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు అప్లికేషన్లు స్వీకరించారు.
ఇలా డౌన్లోడ్ చేసుకుండి
Step 1 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ సందర్శించండి.
Step 2 : గ్రూప్ -4 హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకుండి అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 3 : మీ అప్లికేషన్ ID, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయండి.
Step 4 : పాప్-అప్ మెను నుంచి గ్రూప్ 4 ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డ్‌ని చూడవచ్చు.
Step 5 : మీ హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.
గ్రూప్ 4 మొత్తం ఖాళీల సంఖ్య 8,180 కాగా... ఇందులో జూనియర్ అకౌంటెంట్ పోస్టులు 429, ఆర్థికశాఖ - 191, మున్సిపల్ శాఖ - 238, జూనియర్ అసిస్టెంట్ 5730 పోస్టులు , జూనియర్ ఆడిటర్ పోస్టులు 18 , వార్డ్ ఆఫీసర్ పోస్టులు 1862 ఉన్నాయి. ఈ పరీక్షను మొత్తం 300 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష లేదా ఓంఎంఆర్ ఆన్సర్ షీట్ విధానంలో నిర్వహించనున్నారు. గ్రూప్-4 పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 (జనరల్ స్టడీస్)- 150 మార్కులకు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్)-150 మార్కులకు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు.