AP SSC Supply Memos 2024 : వెబ్‌సైట్‌లో ఏపీ టెన్త్ సప్లిమెంటరీ షార్ట్ మెమోలు - లింక్ ఇదే-ap ssc advanced supplementary results 2024 short memos available on https www bse ap gov in website ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ssc Supply Memos 2024 : వెబ్‌సైట్‌లో ఏపీ టెన్త్ సప్లిమెంటరీ షార్ట్ మెమోలు - లింక్ ఇదే

AP SSC Supply Memos 2024 : వెబ్‌సైట్‌లో ఏపీ టెన్త్ సప్లిమెంటరీ షార్ట్ మెమోలు - లింక్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 30, 2024 06:53 AM IST

AP SSC Supply Results 2024 : ఏపీ పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన షార్ట్ మెమోలపై బోర్డు కీలక ప్రకటన చేసింది.

ఏపీ పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు
ఏపీ పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు

AP SSC Supplementary Results 2024: ఏపీ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాల షార్ట్ మెమోలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మరేకు ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటన విడుదల చేసింది.

సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయిన విద్యార్థులు ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం షార్ట్ మెమోలను వెబ్ సైట్ నుంచి పొందవచ్చని అధికారులు ప్రకటించారు. ఈ షార్ట్ మెమోలోని వివరాలను చూసుకోవాలని… ఏమైనా తప్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు దేవానందరెడ్డి సూచించారు. 

తప్పులు సరిచేసుకునేందుకు జులై 6వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలని స్పష్టం చేశారు. https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి షార్ట్ మెమోలను పొందవచ్చు.

ఇటీవలే సప్లిమెంటరీ ఫలితాల… రీకౌటింగ్ తేదీలివే

ఇటీవలే ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://bse.ap.gov.in/  లో విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. 

ఎస్ఎస్సీ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ 10 వరకు నిర్వహించారు. జూన్ 6 నుంచి 9 వరు 24 క్యాంపులలో జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించారు. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా 62.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని బోర్డు ప్రకటించింది. ఇందులో బాలుర ఉత్తీర్ణత 59.99 శాతం కాగా బాలికల ఉత్తీర్ణత 65.96 శాతంగా ఉంది.

విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్ఎస్సీ బోర్డు తెలిపింది. జూన్ 27 నుంచి జులై 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆఫ్ లైన్ ప్రక్రియ లేదని స్పష్టం చేసింది. 

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు వెంటనే సంబంధిత స్కూల్ హెచ్ఎమ్ ను సంప్రదించి, దరఖాస్తు ఫీజు చెల్లించాలని అధికారులు తెలిపారు. ప్రతి సబ్జెక్టు జవాబు పత్రం రీకౌంటింగ్ కోసం దరఖాస్తు రుసుము రూ.500, ప్రతి సబ్జెక్ట్ జవాబు స్క్రిప్ట్ రీవెరిఫికేషన్ కోసం రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

 

Whats_app_banner