Pawan Kalyan : ఒకేరోజు 13,326 గ్రామసభలు, ఏపీ పంచాయతీ రాజ్ శాఖ వరల్డ్ రికార్డు-డిప్యూటీ సీఎం పవన్ కు సర్టిఫికెట్ అందజేత-ap panchayat raj got world record in a single day conducts 13326 grama sabha pawan received certificate ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : ఒకేరోజు 13,326 గ్రామసభలు, ఏపీ పంచాయతీ రాజ్ శాఖ వరల్డ్ రికార్డు-డిప్యూటీ సీఎం పవన్ కు సర్టిఫికెట్ అందజేత

Pawan Kalyan : ఒకేరోజు 13,326 గ్రామసభలు, ఏపీ పంచాయతీ రాజ్ శాఖ వరల్డ్ రికార్డు-డిప్యూటీ సీఎం పవన్ కు సర్టిఫికెట్ అందజేత

Bandaru Satyaprasad HT Telugu
Sep 16, 2024 03:41 PM IST

Pawan Kalyan : ఏపీ పంచాయతీ రాజ్ శాఖ ప్రపంచ రికార్డు సాధించింది. ఒకేరోజు 13,326 గ్రామ సభల నిర్వహణతో పంచాయతీ రాజ్ శాఖకు వరల్డ్ రికార్డు యూనియన్ గుర్తింపు లభించింది. ఈ సంస్థ ప్రతినిధులు ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసి సర్టిఫికెట్, మెడల్ అందించారు.

ఒకేరోజు 13,326 గ్రామసభలు, ఏపీ పంచాయతీ రాజ్ శాఖ వరల్డ్ రికార్డు
ఒకేరోజు 13,326 గ్రామసభలు, ఏపీ పంచాయతీ రాజ్ శాఖ వరల్డ్ రికార్డు

Pawan Kalyan : ఏపీ పంచాయతీ రాజ్ శాఖ అరుదైన ఘనత సాధించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని పంచాయతీ రాజ్ శాఖ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది. ఒకేరోజు 13,326 గ్రామసభల నిర్వహణతో పంచాయతీ రాజ్ శాఖకు ప్రపంచ రికార్డు దక్కింది. పంచాయతీరాజ్ శాఖకు వరల్డ్ రికార్డు యూనియన్ గుర్తింపు లభించింది. ఈ రికార్డు సర్టిఫికెట్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అందజేశారు. గ్రామ స్వరాజ్యం దిశగా ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

ఒకే రోజు 13,326 గ్రామ సభలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ఆ శాఖకు ప్రపంచ రికార్డు దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభలను గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డు సర్టిఫికెట్, మెడల్ ను ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందచేశారు. హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు.

గ్రామ సభలతో ప్రపంచ రికార్డ్ నెలకొల్పాం - పవన్ కల్యాణ్

గ్రామసభ కార్యక్రమానికి ప్రపంచ స్థాయి గుర్తింపు అందుకోవడం ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి 100 రోజుల లోపే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలకు గాను ప్రపంచ రికార్డ్ సాధించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు "ప్రపంచ రికార్డ్" నెలకొల్పామన్నారు.

వరల్డ్ రికార్డ్స్ యూనియన్ సంస్థ, ఆంధ్ర ప్రదేశ్ లో ఆగస్టు 23వ తేదీన పంచాయతీ రాజ్ శాఖ నిర్వహించిన గ్రామ సభలను గుర్తించి, ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్ ను ఇవాళ అందజేసిందని పవన్ తెలిపారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలియజేయడం ఆనందంగా ఉందన్నారు.

సంబంధిత కథనం