Pawan Kalyan Question in KBC: కౌన్‍ బనేగా కరోడ్‍పతిలో పవన్ కల్యాణ్‍పై ప్రశ్న.. ఏదంటే..-question about pawan kalyan in kaun banega crorepati video goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan Question In Kbc: కౌన్‍ బనేగా కరోడ్‍పతిలో పవన్ కల్యాణ్‍పై ప్రశ్న.. ఏదంటే..

Pawan Kalyan Question in KBC: కౌన్‍ బనేగా కరోడ్‍పతిలో పవన్ కల్యాణ్‍పై ప్రశ్న.. ఏదంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 14, 2024 07:53 AM IST

Pawan Kalyan Question in KBC 16: కౌన్ బనేగా కరోడ్‍పతి 16లో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ప్రశ్న వచ్చింది. కంటెస్టెంట్లను అమితాబ్ క్వశ్చన్ అడిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Pawan Kalyan Question in KBC: కౌన్‍ బనేగా కరోడ్‍పతిలో పవన్ కల్యాణ్‍పై ప్రశ్న
Pawan Kalyan Question in KBC: కౌన్‍ బనేగా కరోడ్‍పతిలో పవన్ కల్యాణ్‍పై ప్రశ్న

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍కు చెందిన జనసేన పార్టీ.. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ చోట గెలిచింది. అద్భుత విజయంతో రికార్డులకెక్కింది. 21 ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కల్యాణ్ పదవి చేపట్టారు. దేశ రాజకీయాల్లోనూ ఆయన పేరు మార్మోగిపోతోంది. కేంద్రంలోనూ కీలకంగా మారారు. కాగా, తాజాగా ‘కౌన్‍బనేగా కరోడ్‍పతి 16’ (కేబీసీ 16)లో పవన్ కల్యాణ్ గురించి ఓ ప్రశ్న వచ్చింది. ఆ షోకు హోస్ట్‌గా ఉన్న బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఈ క్వశ్చన్ అడిగారు.

ప్రశ్న ఇదే

కేబీసీ 16 తాజా ఎపిసోడ్‍కు ఇద్దరు వృద్ధ దంపతులు కంటెస్టెంట్లుగా వచ్చారు. ఈ సందర్భంగా రూ.1,60,000కు గాను పవన్ కల్యాణ్‍పై ప్రశ్న వచ్చింది. 2024 జూన్‍లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సినీ నటుడు ఎవరు? అని అమితాబ్.. వారికి ప్రశ్న ఇచ్చారు. పవన్ కల్యాణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అనే ఆప్షన్లను ఇచ్చారు. అయితే, వారు ఈ ప్రశ్న కోసం లైఫ్‍లైన్ వినియోగించుకున్నారు.

ఈ ప్రశ్నకు ఆడియన్స్ పోల్‍ను ఎంపిక చేసుకున్నారు ఆ ఇద్దరు కంటెస్టెంట్లు. 50శాతానికిపైగా పవన్ కల్యాణ్ అని ఆడియన్స్ పోల్ చేశారు. దీంతో వారు కూడా అదే ఆప్షన్ లాక్ చేశారు. దీంతో రూ.1,60,000 ప్రశ్నను వారు సక్సెస్‍ఫుల్‍గా దాటేశారు.

కేబీసీలో పవన్ కల్యాణ్‍పై వచ్చిన ప్రశ్నకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు వీడియోను షేర్ చేస్తున్నారు.

కౌన్‍బనేగా క్రోడ్‍పతి 16.. ప్రతీ సోమవారం నుంచి శుక్రవారం వరకు సోనీ టీవీలో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతోంది. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనూ చూడొచ్చు. ఈ 16వ సీజన్ ఈ ఏడాది ఆగస్టు 12న ప్రారంభమైంది.

పవన్ సినిమాల లైనప్‍ ఇలా..

పవన్ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్‍లో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది ఏపీ ఎన్నికలకు మూడు నెలల ముందే ఆయన బ్రేక్ తీసుకున్నారు. రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో ఆ చిత్రాల షూటింగ్ పెండింగ్‍లో ఉంది. అయితే, త్వరలోనే ఆయన మళ్లీ షూటింగ్‍లకు వెళ్లనున్నారు. పెండింగ్ చిత్రాలను పూర్తి చేయనున్నారు. సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఓజీ’ చిత్రాన్ని పవన్ ముందుగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీపై చాలా హైప్ ఉంది.

హరిహర వీరమల్లు కూడా పవన్ ఫినిష్ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్రం చాలా ఆలస్యమైపోయింది. ఈ ప్రాజెక్టు నుంచి డైరెక్టర్ క్రిష్ కూడా తప్పుకున్నారు. ఆ బాధ్యతలను జ్యోతికృష్ణ చేపట్టారు. హరిశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పవన్ కల్యాణ్ లైనప్‍లో ఉంది. తాను ప్రజాసేవకే ప్రాధాన్యత ఇస్తానని, వీలైనప్పుడు వారంలో ఒకటి, రెండు రోజులు షూటింగ్‍లు చేసి పెండింగ్‍లో ఉన్న చిత్రాలు పూర్తి చేస్తానని గతంలోనే పవన్ చెప్పారు.