NTR Bharosa Pension : ఏపీ పింఛన్ దారులకు అప్డేట్, పెన్షన్ దారుడు మరణిస్తే భార్యకు నెల రోజుల్లోనే పెన్షన్
NTR Bharosa Pension : పెన్షన్ల జారీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ దారుడు మరణిస్తే అతడి భార్యకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌దారుడు మరణిస్తే భార్యకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్‌దారుడు నవంబర్ 1 తరువాత మరణిస్తే మరణ ధ్రువీకరణ పత్రాన్ని పింఛనుదారుడి భార్య నవంబర్ 15 లోపు గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అందచేస్తే, ఆమోదం పొందిన తరువాత డిసెంబర్ 1 నుంచి వితంతు పెన్షన్ మంజూరు చేస్తారు. ఒకవేళ నవంబర్ 15 తరువాత అందజేస్తే, 2025 జనవరి 1న నుంచి వితంతు పెన్షన్ మంజూరు చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి జి. వీరపాండియన్ ఉత్తర్వులు విడుదల చేశారు.
జీవిత భాగస్వామి పెన్షన్ మంజూరు కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్‌వోపీ) ఇచ్చారు. కుటుంబ పోషణ కోసం ప్రతి నెలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఇప్పటికే ఉన్న పెన్షనర్ మరణిస్తే, జీవిత భాగస్వామి పెన్షన్ (వితంతువు) మంజూరు చేస్తారు.
1. పెన్షనర్ మరణం నవంబర్ 1, లేదా తరువాత సంభవించింది, జీవిత భాగస్వామి పెన్షన్ డిసెంబర్ 1 నుండి ప్రాసెస్ చేయబడుతుంది.
2. ప్రతి నెలా పెన్షన్‌ల పంపిణీ పూర్తయిన తర్వాత, చెల్లించని పెన్షనర్‌ల రిమార్క్స్ క్యాప్చర్ ప్రొవిజన్ మొబైల్ యాప్‌లో డిస్బర్స్‌మెంట్ ఫంక్షనరీ ద్వారా క్యాప్చర్ చేయడానికి ప్రారంభించబడుతుంది.
3. పెన్షనర్ కోసం డెత్ రిమార్క్ క్యాప్చర్ చేసేటప్పుడు, జీవిత భాగస్వామి వివరాలు, జీవిత భాగస్వామి ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ వంటివి తీసుకుంటారు.
4. పెన్షన్ డిస్బర్స్‌మెంట్ ఫంక్షనరీ ద్వారా మరణించిన పింఛనుదారు వివరాలు నిర్ధారణ కోసం పంచాయితీ సెక్రటరీ/ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీకి పంపుతారు.
5. వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్/ వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ మరణ ధృవీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి. జీవిత భాగస్వామి సాధారణ అర్హత ప్రమాణాలతో ధృవీకరించాలి.
6. పెన్షన్ స్వీకరించిన తర్వాత మరణించిన సందర్భంలో పెన్షన్స్ పోర్టల్‌లోని వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్/ వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ లాగిన్‌లో పెన్షనర్ డెత్ సర్టిఫికేట్, జీవిత భాగస్వామి ఆధార్ నంబర్ వంటి అప్‌లోడ్ చేయాలి. అప్పుడు అవసరమైన పత్రాలతో పాటు జీవిత భాగస్వామి పెన్షన్‌ను కూడా ప్రాసెస్ చేస్తారు.
7. అర్హత గల దరఖాస్తులు పెన్షన్ మంజూరు కోసం ఎంపీడీవో/ మున్సిపల్ కమిషనర్‌లకు పంపుతారు.
8. ఎంపీడీవో/మున్సిపల్ కమీషనర్లు అర్హత ప్రకారం మంజూరు చేయొచ్చు. తిరస్కరించవచ్చు.
9. వ్యక్తిగత మంజూరు ప్రక్రియలు వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్/ వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ లాగిన్‌లో చేస్తారు.
10. అనర్హమైన కేసుల కోసం ఎండార్స్‌మెంట్ రూపొందించారు. దరఖాస్తుదారునికి దానిని అందజేస్తారు.
11. జీవిత భాగస్వామి (వితంతువు) పెన్షన్ ప్రతి నెల 15వ తేదీలోపు మంజూరు చేయబడుతుంది. తదుపరి నెలలో సెర్ప్ సీఈవో ద్వారా పెన్షన్ విడుదల అవుతుంది.
12. దీనికోసం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లలందరూ భార్య పెన్షనపై ప్రతినెల తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
13. భార్య పెన్షన్ కోసం పంచాయితీ సెక్రటరీ/ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్/ వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీలందరూ ఎస్‌వోపీను అమలు చేయాలి.
14. డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్లు ప్రక్రియను పర్యవేక్షించి, జిల్లా కలెక్టర్లకు రిపోర్టును సమర్పించాలి.
15. జిల్లా కలెక్టర్లు ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం