AP ECET2024 Notification: ఏపీ ఈసెట్‌ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల, జూలై 10 నుంచి తరగతులు ప్రారంభం-ap e cet admission notification released classes start from july 10 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ecet2024 Notification: ఏపీ ఈసెట్‌ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల, జూలై 10 నుంచి తరగతులు ప్రారంభం

AP ECET2024 Notification: ఏపీ ఈసెట్‌ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల, జూలై 10 నుంచి తరగతులు ప్రారంభం

Sarath chandra.B HT Telugu
Jun 25, 2024 11:27 AM IST

AP ECET2024 Notification: ఏపీ ఈసెట్‌ 2024 మొదటి విడత అడ్మిషన్ షెడ్యూల్ విడుదలైంది. జూలై 10 నుంచి విద్యార్ధులకు తరగతులు ప్రారంభం కానున్నాయి.

రేపటి నుంచి ఏపీ ఈసెట్ రిజిస్ట్రేషన్లు
రేపటి నుంచి ఏపీ ఈసెట్ రిజిస్ట్రేషన్లు

AP ECET2024 Notification: ఏపీ ఈసెట్‌ 2024 అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను కన్వీనర్ విడుదల చేశారు. ఫార్మసీ డిప్లొమా అభ్యర్థులకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

ఏపిఈసెట్ నోటిఫికేషన్ విడుదల అయ్యుంది. అడ్మిషన్ల కన్వీనర్ డాక్టర్ నవ్య వివరాలను విడుదల చేశారు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు , రిజిస్ట్రేషన్ కోసం జూన్ 26 నుండి 30వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు.

సర్టిఫికెట్ల అప్ లోడ్ కు జూన్ 27 నుండి జూలై 3 వరకు అనుమతిస్తామన్నారు. జూలై 1 నుండి 4వ తేదీ వరకు ఆప్షన్స్ నమోదు, 5 న మార్పులకు అవకాశం ఉందని డాక్టర్ నవ్య పేర్కొన్నారు. సీట్ల ఎలాట్మెంట్ జూలై 8న చేయనుండగా, 9 నుండి 15 వరకు సెల్ఫ్ జాయినింగ్ , కళాశాలలో రిపోర్టింగ్ చేయవలసి ఉండగా , జూలై 10వ తేదీ నుండే క్లాసులు ప్రారంభం అవుతాయు.

ప్రస్తుత కౌన్సిలింగ్ వ్యవసాయ డిప్లొమా మినహా ఇంజనీరింగ్‌లో డిప్లొమా హోల్డర్లకు మాత్రమే వర్తిస్తుంది. అగ్రికల్చర్ డిప్లొమా అభ్యర్థులు తదుపరి దశ అడ్మిషన్లలో చేర్చబడతారు.ఫార్మసీ డిప్లొమా అభ్యర్థులకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయబడుతుందని కన్వీనర్ డాక్టర్ నవ్య వివరించారు.

ఏపీ ఈసెట్‌ 2024 అడ్మిషన్ నోటిఫికేషన్‌ విడుదలైంది. మూడేళ్ల డిప్లొమా, బిఎస్సీ మ్యాథ్స్ విద్యార్ధులు ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశించడానికి వెబ్‌ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 26 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయి. వెబ్‌ కౌన్సిలింగ్‌లో పేమెంట్ ప్రాసెస్, రిజిస్ట్రేషన్‌, ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌, ఆప్షన్లను నమోదు చేయనున్నారు.

జూన్‌ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు మొదటి విడత అడ్మిషన్లను నిర్వహించనున్నారు. ఏపీ ఈసెట్‌2024లో అర్హత సాధించిన డిప్లొమా, బిఎస్సీ డిగ్రీ విద్యార్ధులకు 2024-25 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు కల్పిస్తారు.

కౌన్సిలింగ్ షెడ్యూల్...

  • జూన్ 26 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు, విద్యార్థి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తారు.
  • జూన్ 27 నుంచి జూలై 3వ తేదీ వరకు హెల్ప్‌లైన్ సెంటర్లలో ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
  • జూలై 1 నుంచి 4వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేస్తారు.
  • జూలై 5న వెబ్ ఆప్షన్లలో మార్పులకు అనుమతిస్తారు.
  • జూలై 8న సీట్ అలాట్మెంట్ చేస్తారు.
  • జూలై 9 నుంచి 15వ తేదీ వరకు విద్యార్ధులు ఎంపిక చేసుకున్న కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూలై 10 నుంచి తరగతులు ప్రారంభిస్తారు.

కౌన్సిలింగ్ షెడ్యూల్ పూర్తి వివరాల కోసం ఈసెట్ 2024 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. https://ecet-sche.aptonline.in/ECET/Views/index.aspx

Whats_app_banner