Anakapalle Crime : అన‌కాప‌ల్లిలో దారుణం- కాలువ‌లో దూకిన యువ‌తిని కాపాడి, ఆపై అత్యాచారం-anakapalle crime news man rescued woman jumped in canal later molested ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anakapalle Crime : అన‌కాప‌ల్లిలో దారుణం- కాలువ‌లో దూకిన యువ‌తిని కాపాడి, ఆపై అత్యాచారం

Anakapalle Crime : అన‌కాప‌ల్లిలో దారుణం- కాలువ‌లో దూకిన యువ‌తిని కాపాడి, ఆపై అత్యాచారం

HT Telugu Desk HT Telugu
Jul 28, 2024 10:27 AM IST

Anakapalle Crime : అనకాపల్లిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కాలువ దూకిన యువతిని కాపాడిన యువకుడు...ఆమెను అక్రమంగా నిర్బంధించి, అత్యాచారం చేశాడు.

అన‌కాప‌ల్లిలో దారుణం- కాలువ‌లో దూకిన యువ‌తిని కాపాడి, ఆపై అత్యాచారం
అన‌కాప‌ల్లిలో దారుణం- కాలువ‌లో దూకిన యువ‌తిని కాపాడి, ఆపై అత్యాచారం

Anakapalle Crime : అన‌కాప‌ల్లి జిల్లాలో ఘోరం సంఘ‌ట‌న చోటుచేసుకుంది. కాలువ‌లో ప‌డిపోయిన యువ‌తిని కాపాడిన యువ‌కుడు, ఆ యువ‌తిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. కాలువ‌లో ప‌డిపోయిన ఆ యువ‌తిని తీసుకెళ్లి వేరే ఇంట్లో పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడాడ్డు. ఈ ఉదంతం అన‌కాప‌ల్లిలో సంచ‌ల‌నం రేకెత్తించింది.

అన‌కాప‌ల్లి ప‌ట్టణానికి చెందిన 19 ఏళ్ల యువ‌తి ఎస్ రాయ‌వ‌రం మండ‌లం ధ‌ర్మవ‌రం గ్రామానికి చెందిన స్నేహితురాలు, మ‌రో యువ‌కుడితో క‌లిసి ద్విచ‌క్రవాహ‌నంపై సింహాచలం వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వ‌చ్చిన‌ప్పుడు అన‌కాప‌ల్లి మండ‌లం శంక‌రం వ‌ద్ద వీరిని కొత్తూరుకు చెందిన యువ‌కుడు తేజ సాయి కుమార్ అడ్డుకుని వాగ్వాదానికి దిగాడు. అప్పుడు తేజ‌సాయి కుమార్‌తో ఆయ‌న మిత్రులు బి.శంక‌ర్‌, ఎం.హ‌రీష్‌, అభిలాష్, ఎన్‌.ప‌వ‌రన్‌, వి.రామ్ శాంతారాం ఉన్నారు. అయితే వాగ్వాదం జ‌రుగుతున్న స‌మ‌యంలో అన‌కాప‌ల్లి ప‌ట్టణానికి చెందిన ఆ యువ‌తి మ‌న‌స్తాపానికి గురై పక్కనే ఉన్న ఏలేరు కాలువ‌లో దూకింది. అయితే తేజ‌సాయి కుమార్ కాలువ‌లో దూకిన యువ‌త‌ను కాపాడాడు. అనంత‌రం ఉడ్‌పేట‌లోని ఓ ఇంటికి తీసుకెళ్లాడు. జులై 25 రాత్రి ఆ యువ‌తిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువ‌తి తీవ్ర భ‌యాందోళ‌న‌కు లోనైంది. దీంతో యువ‌తి భ‌య‌ప‌డి కూండ్రంలోని త‌న స్నేహితురాలి ఇంటికి వెళ్లింది.

యువ‌తి క‌నిపించ‌క‌పోవ‌డంతో, ఇంటికి రాక‌పోవ‌డంతో ఆమె త‌ల్లిదండ్రులు జులై 26న అన‌కాప‌ల్లి ప‌ట్టణ‌ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. త‌ల్లిదండ్రులు ఫిర్యాదు మేర‌కు మిస్సింగ్ కేసు న‌మోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు. అయితే అదే రోజు సాయంత్రం యువ‌తి ఇంటికి చేరుకుంది. ఏడుస్తూ జ‌రిగిన విష‌యాన్ని త‌ల్లిదండ్రుల‌కు వివ‌రించింది. త‌ల్లిదండ్రులు పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి కుమార్తె చెప్పిన వివ‌రాల‌ను పోలీసులు తెలియ‌జేశారు. దీంతో పోలీసులు తేజ‌సాయి కుమార్‌పై కిడ్నాప్‌, అత్యాచారం కేసును న‌మోదు చేశారు. అలాగే తేజ‌సాయి కుమార్ మిత్రుల‌పై కూడా కిడ్నాప్ కేసు న‌మోదు చేశారు. వెంట‌నే నిందితుల కోసం పోలీసులు గాలింపు చ‌ర్యలు చేప‌ట్టారు. నిందితులను పోలీసులు శ‌నివారం అరెస్టు చేశారు. వారిని కోర్టుకు హాజరుపర్చారు. కోర్టు ప్రొసిడింగ్స్ ప్రకారం తదుప‌రి చ‌ర్యలు ఉంటాయ‌ని అన‌కాప‌ల్లి ప‌ట్టణ‌ సీఐ శంక‌రరావు తెలిపారు.

జ‌గ‌దీశ్వరరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం