CTET 2024 : సీటెట్ అభ్యర్థులకు అలర్ట్, దరఖాస్తు గడువు పొడిగింపు
CTET 2024 : సీటెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. ఏప్రిల్ 5వ తేదీ రాత్రి వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది.
CTET 2024 : కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(CTET 2024) దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. గత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2వ తేదీ రాత్రితో సీటెట్ అప్లికేషన్ల (CTET 2024 Last Date)గడువు ముగిసింది. వెబ్ సైట్ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో చివరి నిమిషంలో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సీటెట్ దరఖాస్తు (CTET 2024 Applications) గడువును ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 11.59 వరకు పెంచింది. ఈ లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవాలని సీబీఎస్ఈ సూచించింది. అభ్యర్థులు సీటెట్ వెబ్ సైట్ https://ctet.nic.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. సీటెట్ ను జులై 7న దేశవ్యాప్తంగా 136 నగరాల్లో నిర్వహిస్తారు.
సీబీఎస్ఈ 19వ ఎడిషన్ CTET పరీక్షను జులై 7 2024న నిర్వహిస్తారు. దేశంలో వ్యాప్తంగా 136 నగరాల్లో ఇరవై భాషల్లో సీటెట్ నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి. సీటెట్ ను ఏడాదిలో రెండు సార్లు నిర్వహిస్తారు.
CTET 2024 పరీక్షకు ఎలా దరఖాస్తు చేయాలి?
Step 1 : సీటెట్ అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in సందర్శించండి.
Step 2 : అభ్యర్థి యాక్టివిటీ బోర్డ్ కింద ఉన్న CTET జులై 2024 లింక్ పై క్లిక్ చేయండి.
Step 3 : అభ్యర్థి తన సమాచారాన్ని నమోదు చేసుకోండి.
Step 4 : ఆ తర్వాత మీ వివరాలతో ఖాతాను లాగిన్ చేయండి.
Step 4 : CTET దరఖాస్తు ఫామ్‌ను నింపండి.
Step 5 : ఫొటో, సంతకం, ఇతర అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయండి.
Step 6 : సీటెట్ రుసుము చెల్లించండి.
సీటెట్ పరీక్ష విధానం(CET Exam)
సీటెట్ రిజిస్ట్రేషన్(CET Registration) కోసం జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.1000, రెండు పేపర్లకు రూ.1200 రుసుము చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులు ఒక పేపర్‌కు రూ.500, రెండు పేపర్లకు రూ.600 రుసుము చెల్లించాలి. సీటెట్ స్కోరును(CTET Score) కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలకు జరిగి ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్ స్కోరుకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. సీటెట్ ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. ఒకటి నుంచి 5వ తరగతులకు బోధించాలనుకునే వారు పేపర్-1, 6 నుంచి 9వ తరగతుల వరకు బోధించాలనుకునే అభ్యర్థులు పేపర్-2ను రాయవచ్చు. సీటెట్ లో ప్రశ్నలన్నీ మల్టిపుల్ ఛాయిస్ రూపంలోనే ఉంటాయి. నాలుగు ఆప్షన్స్‌లో ఒకటి ఎంపిక చేసి, ఓఎంఆర్‌లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేపర్-2 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. పేపర్-1 పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు నిర్వహిస్తారు.