CEO Mukesh Kumar Meena : ఈసీ అనుమతిస్తేనే డీఎస్సీ పరీక్షలు, పవన్ సినిమా గ్లాస్ డైలాగ్ పై సీఈవో ఏమన్నారంటే?
CEO Mukesh Kumar Meena : ముందస్తు అనుమతి లేకుండా ప్రచారాలు, సభలు నిర్వహించకూడదని ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రచారాల్లో వాలంటీర్లు, ఉద్యోగులు పాల్గొంటున్నారని ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఇప్పటి వరకూ 46 మందిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు.
CEO Mukesh Kumar Meena : రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా(CEO Mukesh Kumar Meena) తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాత మాట్లాడుతూ... ముందస్తు అనుమతి లేకుండా ఎవరు కూడా ప్రచారాలు, సభలు నిర్వహించకూడదని తెలిపారు. సువిధ యాప్(Suvidha App) ద్వారా సభలు, ప్రచారానికి అనుమతులు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు (Govt Employees)ఎట్టి పరిస్థితుల్లో ప్రచారాల్లో పాల్గొనకూడదని ఆదేశాలు ఉన్నాయన్నారు. ఇది చట్టప్రకారం నేరమన్నారు. వాలంటీర్లు(AP Volunteers), ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారాల్లో పాల్గొంటున్నారని ఫిర్యాదు అందుతున్నాయన్నారు. నిన్నటి వరకూ 46 మందిపై చర్యలు తీసుకున్నారు. కొందరిపై కేసులు కూడా నమోదు ఛేశామన్నారు.
మూడు రోజుల్లో 385 కేసులు
"వాలంటీర్లు, ఉద్యోగులు స్వయంగా వెళ్లి ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రధాని మోదీ (PM Modi Meeting)సభకు గురించి ఫిర్యాదులు అందాయి. ఇది హోంశాఖకు సంబంధించింది. రాజకీయ ప్రకటనలకు ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మూడు రోజుల్లో బహిరంగ ప్రాంతాల్లో రాజకీయ ప్రకటనలు(Political advertisements) తొలగించాలని ఆదేశించాం. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై మూడు రోజుల్లో 385 కేసులు నమోదు అయ్యాయి."- సీఈవో ముఖేష్ కుమార్ మీనా
ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ పై
ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో(Ustaad Bhagat Singh) జనసేన గుర్తు గ్లాస్(Glass Symbol) గురించి డైలాగులు ఉన్నాయని మీడియా రిపోర్టులు సీఈవో ముఖేష్ కుమార్ మీనాను అడిగారు. అయితే ఈ టీజర్ ను తాను చూడలేదనన్నారు. పొలిటికల్ ప్రచారం తరహాల ఉంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సిందేనని చెప్పారు. ఆ టీజర్ చూస్తే కానీ ఏ విషయం చెప్పాలేమన్నారు. ఇక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను సి-విజిల్ (CVigil)యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. సి-విజిల్ యాప్ లో అందిన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసకుంటామన్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వ స్థలాల్లో ఉన్న 1.99 లక్షల రాజకీయ హోర్డింగులు, ప్రైవేట్ స్థలాల్లోని 1.15 ప్రకటనలు తొలగించామన్నారు. గత మూడు రోజులుగా 3.39 కోట్ల విలువైన మద్యం, నగదును స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు.
సి-విజిల్ యాప్ లో ఫిర్యాదు
ప్రభుత్వ భవనాలపై రాజకీయ నేతల ఫొటోలు, ప్రకటనలు తొలగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారం చేయకూడదన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసి, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేస్తున్నాయన్నారు. సి-విజిల్ యాప్(Cvigil App) ద్వారా ఎవరైనా ఫొటో, వీడియో తీసి పంపవచ్చని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 385 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం 173 బృందాలు తనిఖీల్లో పాల్గొంటున్నాయని సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రధాని మోదీ సభ భద్రతా వైఫల్యాలపై ఫిర్యాదులు అందాయన్న సీఈవో... అయితే ఈ విషయం కేంద్ర హోంశాఖ, ఎన్ఎస్జీ పరిధిలో ఉంటుందన్నారు. ఎన్నికల కమిషన్ కు ఇందులో ఎలాంటి పాత్ర ఉండదన్నారు. నాకు ఫిర్యాదు చేసినా ఏ చర్యలు తీసుకోలేమన్నారు.
డీఎస్సీ పరీక్షలపై స్పందిస్తూ… ఈసీ అనుమతిస్తే డీఎస్సీ పరీక్షలు(DSC Exams) నిర్వహించాలని సీఈవో అన్నారు. డీఎస్సీ నియామకాలపై ఈసీకి పంపిస్తామని, అనుమతి ఇస్తేనే డీఎస్సీ పరీక్ష జరుగుతోందన్నారు.
సంబంధిత కథనం