AP Election Code : ఇవాళ మధ్యాహ్నం 3 వరకే డెడ్ లైన్, అన్ని రాజకీయ హోర్డింగ్స్ తొలగించండి- సీఈవో ముఖేష్ కుమార్ మీనా-amaravati ap ceo mukesh kumar meena orders remove all political cutouts hoardings by march 17th ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Election Code : ఇవాళ మధ్యాహ్నం 3 వరకే డెడ్ లైన్, అన్ని రాజకీయ హోర్డింగ్స్ తొలగించండి- సీఈవో ముఖేష్ కుమార్ మీనా

AP Election Code : ఇవాళ మధ్యాహ్నం 3 వరకే డెడ్ లైన్, అన్ని రాజకీయ హోర్డింగ్స్ తొలగించండి- సీఈవో ముఖేష్ కుమార్ మీనా

Mar 17, 2024, 02:39 PM IST Bandaru Satyaprasad
Mar 17, 2024, 01:46 PM , IST

  • AP Election Code : ఏపీలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగ్స్, పోస్టర్లు , కటౌట్లను ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోపు తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.

ఏపీలో ఎన్నికల నగారా మోగింది. నిన్నటి నుంచి ఎలక్షన్ కోడ్(Election Code) అమల్లోకి వచ్చింది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో  ప్రభుత్వ కార్యాలయాలు,  బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగ్స్, పోస్టర్లు , కటౌట్లను ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోపు తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. 

(1 / 5)

రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాల్లోని రాజకీయపరమైన హోర్డింగ్స్ తక్షణమే తొలగించాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనా(CEO Mukesh Kumar Meena) ఆదేశించారు. 

(2 / 5)

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా  అమలుపరిచే అంశానికి సంబంధించి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర సచివాలయం నుంచి సీఈవో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నారు.

(3 / 5)

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని (AP Election Code)పటిష్టంగా అమలుపరచడం, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టంను విస్తృత స్థాయిలో వినియోగించడం, సి-విజిల్ ద్వారా అందే  ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం తదితర అంశాలను ఈ సమావేశంలో సీఈవో ముఖేష్ కుమార్ మీనా సమీక్షిస్తున్నారు.

(4 / 5)

ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు  అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, జాయిన్ సీఈఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవోలు కె. విశ్వేశ్వరరావు, ఎస్.మల్లిబాబు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు