AP Inter Results 2024 : ఏపీ ఇంటర్ ఫలితాలపై అప్డేట్, ఏప్రిల్ రెండో వారంలో వచ్చే ఛాన్స్!
AP Inter Results 2024 : ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షలు విజయవంతంగా ముగిశాయని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 4వ తేదీకి వాల్యుయేషన్ పూర్తి కానుందన్నారు. ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
AP Inter Results 2024 : ఏపీలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు(AP Inter Exams) ముగిశాయి. దీంతో బోర్డు అధికారులు స్పాట్ వ్యాలుయేషన్ పై దృష్టి పెట్టారు. మొత్తం ఐదు విడతల్లో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్(AP Inter Spot Valuation) చేస్తున్నారు. మార్చి 23కు మూడు ఫేజ్ లో వాల్యుయేషన్ పూర్తి కాగా, మార్చి 25 నుంచి 27 వరకు నాలుగో ఫేజ్, మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 వరకు ఐదో ఫేజ్ స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేయనున్నారు. మార్కుల అప్లోడ్ కోసం పది రోజుల పట్టే అవకాశం ఉంది. ఏపీ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ రెండో వారంలో విడుదల కావొచ్చని సమాచారం, మార్కుల అప్లోడ్ ఆలస్యమైతే ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని సమాచారం.
ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలు?
గత ఏడాది ఇంటర్ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్(Spot Valuation) చివరి దశ ఏప్రిల్ 8న ముగిసింది. దీంతో ఏప్రిల్ 26న ఇంటర్ ఫలితాలు ప్రకటించారు. ఈ అంచనాల ప్రకారం ఈ ఏడాది ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ రెండో లేదా మూడో వారంలో విడుదల చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. త్వరలో ఇంటర్ ఫలితాలు తేదీని బోర్డు ప్రకటించనుంది. గతంలో మాదిరిగా ఇంటర్ మొదటి, రెండో ఏడాది ఫలితాలు(AP Inter Results) ఒకే రోజున విడుదల చేయనుంది. ఇంటర్ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్ సైట్లు bie.ap.gov.in , results.apcfss.in లతో పాటు మీడియా వెబ్‌సైట్‌లలో చెక్ చేసుకోవచ్చు. అనంతరం అభ్యర్థులు రీవాల్యుయేషన్ కు దరఖాస్తుకు అవకాశం కల్పిస్తారు.
ఏప్రిల్ 4 నాటికి వాల్యుయేషన్ పూర్తి
ఏపీలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు(AP Intermediate Exams) విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో 75 మాల్ ప్రాక్టీస్ కేసులు(Malpractice Cases) నమోదు అయ్యాయని తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో రెగ్యులర్, ఒకేషనల్ పరీక్షలకు ఫస్టియర్ 5,17,617 మంది, సెకండియర్ 5,35,056 మంది మొత్తంగా 10,52,673 మంది పరీక్షలకు అప్లై చేసుకున్నారు. వీరిలో 9,99,698 మంది పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 52,900 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. ఇప్పటికే ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభించామన్నారు. ఏప్రిల్ 4 నాటికి స్పాట్ వాల్యుయేషన్(Inter Spot Valuation) ప్రక్రియను పూర్తి చేయనున్నామని తెలిపారు. ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు(AP Inter Results 2024) విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సీసీ కెమెరాల నిఘాలో పరీక్షల నిర్వహణ
ఈ ఏడాది ఇంటర్ పరీక్షల(AP Inter Exams 2024) నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇంటర్ పరీక్షలు నిర్వహించిన 1559 సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిఘా పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22 వేల సీసీ కెమెరాలతో (CC Cameras)పరీక్షల సరళిని పర్యవేక్షించారు. తాడేపల్లిలోని ఇంటర్మీడియేట్ బోర్డు కార్యాలయం నుంచి పరీక్షల సరళిని నిరంతరం పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రాల నుంచి ప్రశ్నాపత్రాలు బయటకు రాకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు ప్రశ్నపత్రాలకు మూడు స్థాయిల్లో క్యూఆర్ కోడ్‌ను(QR Code) ముద్రించారు. లీకైన ప్రశ్నాపత్రం ఎవరు లీక్ చేశారో సులభంగా కనిపెట్టేలా చర్యలు చేపట్టారు.