Inter Spot Valuation: ఏపీలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం.. ఏప్రిల్‌లోనే ఫలితాల విడుదల-evaluation of inter answer papers has started in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Inter Spot Valuation: ఏపీలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం.. ఏప్రిల్‌లోనే ఫలితాల విడుదల

Inter Spot Valuation: ఏపీలో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం.. ఏప్రిల్‌లోనే ఫలితాల విడుదల

Sarath chandra.B HT Telugu

Inter Spot Valuation: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 23వేల మంది ఉపాధ్యాయులతో వాల్యూయేషన్ ప్రారంభించారు.

ఏపీ విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్

Inter Spot Valuation: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్ధుల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. ఏప్రిల్ 4వరకు మూల్యాంకనం కొనసాగనుంది. ఏప్రిల్ రెండు, మూడో వారాల్లోనే ఫలితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఏపీ AP  ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 23వేల మంది అధ్యాపకులు ఇంటర్ విద్యార్ధుల వాల్యూయేషన్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి బోర్డు పరీక్షలను పకడబ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ కోసం 35,119 మంది ఇన్విజిలేటర్లు, 156 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 682 సిట్టింగ్ స్వ్కాడ్లు ఏర్పాటు చేశారు. ప్రశ్న పత్రంలోని ప్రతి పేజీ పై భాగంలో క్యూఆర్ కోడ్ తో పాటు వాటర్ మార్క్ తో కూడిన వెబ్ డింగ్ ఫాంట్ కోడ్ ఏర్పాటుచ ేశారు.

ఏపీలో Andhra pradesh పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో ఆధునిక మౌలిక వసతుల కల్పన ఏర్పాటు చేసినట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పర్యవేక్షించారు.

రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో 4 ఏప్రిల్, 2024 వరకు మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందన్నారు. సుమారు 23,000 మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో పాల్గొని దాదాపు 60 లక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేస్తారని వెల్లడించారు. ప్రతి కేంద్రంలో ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారని వివరించారు. ఫలితాలను ఏప్రిల్‌ నెలలోనే విడుదల చేసేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నేడు 3,473 పరీక్షా కేంద్రాలలో చీఫ్ సూపరింటెండెంట్లు మరియు శాఖాధికారుల పర్యవేక్షణలో 10వ తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. పదో తరగతి పరీక్షలు విద్యార్థి జీవితంలో కీలకమైన ఘట్టమని ఆయన అభివర్ణించారు. 1 నుండి 9 వ తరగతి వరకు తమ స్వంత పాఠశాల పరిసరాల్లో పరీక్షలు రాసిన విద్యార్థులకు బోర్డు పరీక్షలు కొత్త అనుభూతిని కలిగించి, కొత్త వాతావరణాన్ని పరిచయం చేస్తాయన్నారు.

పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో ఎప్పుడూ లేని విధంగా విద్యార్థులకు 100% బెంచ్ సీటింగ్, తాగునీటి కోసం RO ప్లాంట్లు, హై-ఎండ్ టాయిలెట్లు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, కొన్ని కేంద్రాల్లో ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు వంటి ఆధునిక మౌలిక వసతులు కల్పించామన్నారు.

మార్చి 2024లో జరుగుతున్న ఎస్సెస్సీ పరీక్షలకు నమోదు చేసుకున్న 7,25,618 మంది విద్యార్థులకు 30,234 గదులు అందుబాటులో ఉన్నాయన్నారు. పరీక్షా నిర్వహణ, పర్యవేక్షణ కోసం 35,119 మంది ఇన్విజిలేటర్లు, 156 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 682 సిట్టింగ్ స్వ్కాడ్లు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. 130 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పరీక్షలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.

పరీక్షలో అక్రమాలు జరగకుండా పారదర్శకంగా జరిగేందుకు వీలుగా ప్రశ్న పత్రంలోని ప్రతి పేజీ పై భాగంలో క్యూఆర్ కోడ్ తో పాటు వాటర్ మార్క్ తో కూడిన వెబ్ డింగ్ ఫాంట్ కోడ్ కూడా ఉంటుందన్నారు. అంతేగాక సీసీటీవీ కెమెరాలను సైతం పర్యవేక్షణ కోసం వినియోగిస్తున్నామన్నారు.

సంబంధిత కథనం