Hyderabad: మరీ ఇంత దారుణమా.. ఛార్జర్ కోసం మహిళను చంపిన యువకుడు
26 August 2024, 16:03 IST
- Hyderabad: చిన్న చిన్న విషయాలకు గొడవలు జరిగి.. తీరా అవి చంపుకునే వరకు వెళ్తున్నాయి. తాజాగా హైదరాబాద్ సమీపంలోని దుండిగల్‌లో దారుణం జరిగింది. సెల్ ఫోన్ ఛార్జర్ కోసం ఓ యువకుడు మహిళను మర్డర్ చేశారు. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
పోలీసుల అందుపులో నిందితుడు కమల్ కుమార్
హైదరాబాద్ సమీపంలోని దుండిగల్‌లో దారుణం జరిగింది. ఛార్జర్ కోసం యువకుడు ఓ మహిళను చంపేశాడు. ఛార్జర్ ఇవ్వలేదని శాంత అనే మహిళను.. కమల్ కుమార్ కొట్టి చంపాడు. సీసీ కెమెరాలో హత్య దృశ్యాలు రికార్డయ్యాయి.
నోరు మూసి..
దుండిగల్‌లో శాంత అనే మహిళ బెల్ట్ షాపు నిర్వహిస్తోంది. అక్కడికి కమల్ కుమార్ అనే యువకుడు వచ్చాడు. శాంతను సెల్ ఫోన్ ఛార్జర్ అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో గొడవ జరిగింది. దీంతో కమల్ కుమార్ కోపంతో ఊగిపోయాడు. శాంత అరవకుండా నోరు మూసేసి హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. కమల్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
రాడ్డుతో కొట్టి..
మరోవైపు హైదరాబాద్‌లోని మధురానగర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేశాడన్న కారణంలో ఓ యువకుడిని పండ్ల వ్యాపారి చంపేశాడు. తన షాపులోకి దొంగతనం చేసేందుకు వచ్చినప్పుడు ఇనుపరాడుతో దాడికి దిగాడు. విచక్షణారహితంగా కొట్టడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
చనిపోయిన వ్యక్తి పలుమార్లు ఇదే షాపులో దొంగతనం చేసినట్లు తెలిస్తోంది. గల్లా పెట్టెలో ఉన్న డబ్బులను తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా.. దొంగతనం చేస్తుండగా పండ వ్యాపారి మహమ్మద్ ఉస్మాన్ పట్టుకున్నాడు. కోపోద్రిక్తుడైన ఉస్మాన్.. షాపులో ఉన్న ఇనుపరాడుతో దాడి చేశాడు. దెబ్బల ధాటికి నడిరోడ్డుపైనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై KPHB పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కన్నతల్లి గొంతు కోసి..
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. నిడమనూరు మండల కేంద్రంలో కన్నతల్లిని గొంతుకోసి కొడుకు హత్య చేశాడు. ఆ తర్వాత అదే కత్తిలో గొంతు కోసుకొని బలవనర్మణానికి పాల్పడ్డాడు. ఏడాది కిందట శివ (36)కు వివాహమైంది. ఇటీవలనే భార్యతో విడాకులు తీసుకున్నాడు. అయితే శివ మానసికస్థితి సరిగా లేదని బంధువులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తల్లిని చంపి అతను కూడా సూసైడ్ చేసుకున్నాడని చెబుతున్నారు.