Son killed Mother: భార్యకు రెండో పెళ్లితో తల్లిని హత్య చేసిన తనయుడు, నల్గొండ జిల్లాలో దారుణం..
Son killed Mother: నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. భార్యకు జరుగుతున్న రెండో పెళ్లిని కుటుంబ సభ్యులు మద్దతుగా నిలవడాన్ని సహించలేని తనయుడు కన్నతల్లిని హతమార్చాడు. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లికి వెళ్లిన వారు ఇంటికి తిరిగి వచ్చేలోపు విగతజీవులుగా మారిన ఘటన మహబూబ్‌నగర్‌లో జరిగింది.
Son killed Mother: కన్న కొడుకే తల్లిని బలి తీసుకున్న దారుణ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. మద్యం మత్తులో కన్నతల్లిని కిరాతకంగా హత్య చేసి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రం, మహబూబ్‌నగర్ జిల్లా గండీడు మండల పరిధిలోని సల్కర్‌పేట్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. .
నిడమనూరు మండల కేంద్రంలో ఉంటున్న రావిరాల వీరయ్య, సాయమ్మ(65) దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ దంపతులకు కుమారులు శ్రీను, శివతో పాటు కుమార్తె పద్మ ఉన్నారు. గ్రామంలో పాలు విక్రయించి జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాస్ మిర్యాలగూడలో టైలరింగ్ వృత్తిలో ఉన్నాడు. చిన్న కుమారుడు శివకుమార్(36) కారు డ్రైవరుగా పనిచేస్తూ తల్లిదండ్రుల వద్దే ఉండేవాడు. సోదరి పద్మ కుమార్తె మేఘనతో శివకుమార్‌కు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఓ కుమార్తె పుట్టి చనిపోయింది.
మనస్పర్థల కారణంగా శివ, మేఘనలు రెండేళ్ల క్రితం పెద్దల సమక్షంలో విడి పోయారు. కోర్టులో కూడా విడాకుల కేసు నడుస్తోంది. ఈ క్రమంలో శివ మద్యానికి బానిసైనట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఆ పెళ్లికి శివకుమార్ తండ్రి, సోదరుడు వెళ్లారు. దీన్ని శివకుమార్ జీర్ణించుకోలేకపోయాడు.మేఘనకు శనివారం హైద రాబాద్‌లో మరో వ్యక్తితో పెళ్లి చేశారు. మేనకోడలి రెండో పెళ్లికి తన తల్లితండ్రుల మద్దతు ఇవ్వడాన్ని శివ జీర్ణించుకోలేకపోాయాడు.
శనివారం జరిగిన పెళ్లికి తండ్రితో పాటు సోదరుడు కూడా వెళ్లడంతో కోపం పెంచుకున్నాడు. మద్యం మత్తులో శనివారం పొద్దుపోయాక తల్లితో గొడవపడ్డాడు. తల్లి మందలించడంతో వంటగదిలో ఉన్న కత్తితో ఆమె గొంతు కోసి, కడుపులో పొడవడంతో సాయమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. ఇంటి నుంచి బయటకు వచ్చి గొంతు కోసుకొని అక్కడే చనిపోయాడు.
హైదరాబాద్‌లో పెళ్లికి శివ తండ్రి వీరయ్య, మిర్యాలగూడలో ఉంటున్న శ్రీను ఇద్దరూ ఆదివారం ఉదయం ఇంటికి వచ్చే సరికి సాయమ్మ. శివ ఇంటి వద్ద విగత జీవులుగా పడిఉన్నారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్రాజు, హాలియా సీఐ జనార్దన్ రాథోడ్, నిడమనూరు ఎస్సై గోపాల్ రావు... ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. పోస్టుమార్షం నిమిత్తం మృతదే హాలను మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు వీరయ్య ఇచ్చిన ఫిర్యాదుతో హత్య, ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు.
మద్యం మత్తులో మరొకరు…
మహబూబ్‌నగర్ జిల్లా గండీడు మండలం సల్కర్‌పేట్‌కు చెందిన వెంకటమ్మను కుమారుడు కృష్ణ దారుణంగా హత్య చేశాడు. ఊర్లో ఇటీవలే కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన వెంకటమ్మ ఇంటి పని పూర్తయ్యాక కుమారుడికి పెళ్లి చేయాలని భావించింది. మద్యానికి బానిసైన కృష్ణయ్య డబ్బుల కోసం తరచూ తల్లితో గొడవపడేవాడని గ్రామస్తులు చెబుతున్నారు.
శనివారం రాత్రి కూడా మద్యం తాగి వచ్చి తల్లితో గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వక పోవడంతో ఇనుపరాడ్డుతో తలపై మోది, గొంతు కోసి చంపేశాడు. మృతదేహాన్ని లాక్కెళ్లి ఇంటి దగ్గరల్లోని చెట్ల పొదల్లో పడేశాడు ఉదయం తన తల్లి కనిపించడం వెదుకుతున్నట్టు నటించాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గట్టిగా నిలదీయడంతో హత్య విషయం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.