తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నారా..? అయితే ఈ 10 విషయాలు అస్సలు మర్చిపోకండి!

Hyderabad : హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నారా..? అయితే ఈ 10 విషయాలు అస్సలు మర్చిపోకండి!

21 December 2024, 10:13 IST

google News
    • Hyderabad : హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొనుగోలు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఎంతో కాలం సంపాదించి, ఇల్లు, స్థలం కొంటారు. ఆ తర్వాత ఏ చిన్న సమస్య వచ్చినా.. కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అందుకే భాగ్యనగరంలో ప్రాపర్టీ కొనేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఓసారి చూద్దాం.
హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నారా..?
హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నారా..? (@HyderabdInfra)

హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నారా..?

ప్రస్తుతం హైదరాబాద్‌లో భూములకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో భూమి బంగారం కంటే విలువైందిగా మారింది. అంత డబ్బు పెట్టలేని వారు అపార్ట్‌మెంట్లలో డబుల్, త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. ఇంకాస్త డబ్బున్న వారు విల్లాలు కొంటున్నారు.

అయితే.. భాగ్యనగరంలో భూముల రేట్లతో పాటు.. మోసాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే ఏ ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నా.. తప్పుకుండా అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆ తర్వాతే కొనుగోలు చేయాలి. హైదరాబాద్‌లో ప్రాపర్టీ కొనాలనుకునే వారి కోసం 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.బడ్జెట్ నిర్ణయించుకోవడం:

మీరు ఎంత ఖర్చు చేయగలరో ముందుగా నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. ఇందులో ఇంటి ధరతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, లోన్, ఈఎంఐలు వంటి అన్ని ఖర్చులు చేర్చాలి. మీరు ఈఎంఐని ఎంత చెల్లించగలరో కూడా పరిగణించాలి.

2.ప్రాంతాన్ని ఎంచుకోవడం:

మీరు ఎక్కడ నివసించాలనుకుంటున్నారు, మీ పని ప్రదేశానికి ఎంత దూరం ఉండాలి, అక్కడ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి వంటి అంశాలను పరిగణించి ప్రాంతాన్ని ఎంచుకోవాలి. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలు ఐటీ కంపెనీలకు దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ధరలు ఎక్కువగా ఉంటాయి. మిగతా ప్రాంతాల్లో ధరలు తక్కువగా ఉంటాయి. కానీ మౌలిక సదుపాయాలు అంతగా అభివృద్ధి చెందకపోవచ్చు.

3.బిల్డర్‌ను ఎంచుకోవడం:

బిల్డర్‌ గత ప్రాజెక్టులు, వారి పేరు మీద ఉన్న కేసులు, వారు రేరాలో నమోదు చేసుకున్నారా లేదా అనే విషయాలను పరిశీలించాలి. బిల్డర్‌తో ఒప్పందం చేసుకునే ముందు ఒకసారి న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

4.ప్రాజెక్టు అనుమతులు:

ప్రాజెక్టుకు అన్ని అవసరమైన అనుమతులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. అపార్ట్‌మెంట్‌లు లేదా విల్లాస్ కొనుగోలు చేసేటప్పుడు ఆక్సపెషన్ సర్టిఫికేట్ ఉందో లేదో చూడాలి.

5.సేల్ డీడ్:

సేల్ డీడ్‌లో అన్ని వివరాలు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. సేల్ డీడ్‌ను న్యాయ నిపుణుల ద్వారా పరిశీలించించుకోవడం మంచిది.

6.స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్:

స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను సకాలంలో చెల్లించాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవడం అస్సలు మర్చిపోకూడదు.

7.బ్యాంక్ లోన్:

మీరు బ్యాంక్ లోన్ తీసుకుంటే, బ్యాంకు నిబంధనలను జాగ్రత్తగా చదవండి. ఈఎంఐని చెల్లించే సామర్థ్యం మీకు ఉందో లేదో చూసుకోండి. ఆ తర్వాత ఇబ్బందులు పడకుండా ఉంటారు.

8.ఆస్తి పన్ను:

ఆస్తి పన్నును సకాలంలో చెల్లించాలి. దీని గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి. సందేహం ఉంటే వెంటనే అధికారులను సంప్రదించాలి.

9.ఇతర ఖర్చులు:

మరమ్మతులు, ఇన్షూరెన్స్, మెయింటెనెన్స్ ఛార్జీలు వంటి ఇతర ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

10.న్యాయ సలహా:

రియల్ ఎస్టేట్ కొనుగోలు ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. కాబట్టి న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. లేకపోతే ఆ రంగంలో మంచి అనుభవం ఉన్నవారి సలహాలు తప్పకుండా తీసుకోవాలి.

తదుపరి వ్యాసం