Clove Milk: అబ్బాయిలు రాత్రి పాలలో ఇది కలిపి తాగండి, లైంగిక సామర్థ్యం పెంచే ఔషధం
Clove Milk: హార్మోన్ల సమస్యల నుండి పురుషుల శారీరక సమస్యలను తొలగించడం ద్వారా లవంగ పాలతో ప్రయోజనాలున్నాయి. ఈ పాలు సంతానోత్పత్తిని పెంచుతాయి. అబ్బాయిలు లవంగం పాలు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
పాలను సంపూర్ణ ఆహారం అంటారు. ఇందులో ప్రోటీన్, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, పొటాషియం, కార్బోహైడ్రేట్, కొవ్వు, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ డి వంటి అనేక పోషకాలుంటాయి. ఎన్నో ప్రయోజనాలున్న పాలను ఒక్కో సమస్యకు ఒక్కో రకంగా తాగుతారు. పిల్లల పదునైన మెదడుకు బాదం పాలు, జలుబు నుండి ఉపశమనం కోసం పసుపు పాలు.. తాగుతారు.
అలాగే పురుషులకు లవంగాల పాలు ఒక వరం అనుకోవచ్చు. లవంగం పాలు పురుషుల్లో అనేక శారీరక సమస్యలను, హార్మోన్ల సమస్యలను తగ్గించడానికి, సంతానోత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి. పురుషులకు లవంగం పాలు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
లవంగం పాల లాభాలు:
కడుపులో అల్సర్లు:
కడుపులో అల్సర్ల వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పాలు, లవంగాల కలయిక అల్సర్ నుంచి ఉపశమనం ఇస్తుంది.
జీర్ణవ్యవస్థ:
లవంగం పాలు తాగడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి మలబద్దక సమస్యలు దరిచేరవు. ఇందులో ఉండే ఫైబర్ కడుపును శుభ్రంగా ఉంచి ప్రేగు కదలికను సక్రమంగా నిర్వహిస్తుంది. ఇది ఉబ్బరం, గ్యాస్ సమస్యను కూడా నివారిస్తుంది.
సంతానోత్పత్తి:
లవంగం పాలు పురుషుల్లో సంతానోత్పత్తికి స్టామినా బూస్టర్ అని చెబుతారు. ఎన్ఐహెచ్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్) ప్రకారం, లవంగం పాలకున్న యాంటీమైక్రోబయల్ లక్షణాల కారణంగా పురుషుల్లో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయి. లవంగాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి పురుషుల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. లవంగం పాలు తాగడం వల్ల పురుషుల శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరిగి రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది పురుషుల్లో సెక్స్ డ్రైవ్ ను పెంచుతుంది. సిగరెట్లు, ఆల్కహాల్, అనారోగ్యకర జీవనశైలి కారణంగా చాలాసార్లు పురుషుల్లో శుక్ర కణాల నాణ్యత తగ్గుతుంది. ఈ ప్రభావం సంతానోత్పత్తి మీద పడుతుంది. లవంగం పాలతో శుక్రకణాల నాణ్యత కూడా మెరుగుపడుతుంది.
లవంగం పాలు ఎలా చేయాలి?
పురుషులు రాత్రి పడుకునే ముందు లవంగం పాలు తాగాలి. లవంగం పాలు తయారు చేయడానికి ఒక కప్పు పాలలో 3-4 లవంగాలు వేసి మీడియం మంట మీద 10-15 నిమిషాలు మరిగించండి. లవంగాలు తీసేసి లేదా అలాగే ఈ పాలను తాగేయొచ్చు. మీకు రుచి నచ్చడానికి తీపి కోసం కాస్త తేనె కలుపుకున్నా పరవాలేదు.
లవంగాల లాభాలు:
లవంగాలలో రాగి, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. పాలలో ఉండే క్యాల్షియం, ప్రోటీన్ తో పాటు పోషక విలువలు లవంగాల వల్ల మరింత పెరుగుతాయి. ఇది ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది. ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీలను దూరం చేసుకోవాలంటే కూడా లవంగం పాలు తాగొచ్చు.
గొంతునొప్పికి:
వాతావరణంలో మార్పువల్ల గొంతునొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తుంటాయి. లవంగం పాలు ఈ సమస్యల నుండి ఉపశమనం పొందటానికి పనిచేస్తాయి. నిజానికి లవంగాలను పాలలో కలిపి తాగడం వల్ల శరీరానికి వేడి వస్తుంది. ఇది గొంతు సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.