Pine nuts: ఈ గింజల ధరతో బంగారం కొనొచ్చు.. మధురమైన రుచితో సంతానోత్పత్తి, గుండె సమస్యలూ తగ్గిస్తాయి-from infertility to heart health know the benefits of pine nuts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pine Nuts: ఈ గింజల ధరతో బంగారం కొనొచ్చు.. మధురమైన రుచితో సంతానోత్పత్తి, గుండె సమస్యలూ తగ్గిస్తాయి

Pine nuts: ఈ గింజల ధరతో బంగారం కొనొచ్చు.. మధురమైన రుచితో సంతానోత్పత్తి, గుండె సమస్యలూ తగ్గిస్తాయి

Koutik Pranaya Sree HT Telugu
Aug 11, 2024 05:00 PM IST

Pine nuts: పైన్ నట్స్‌నే చిల్గోజా అంటారు. దీంతో శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. పోషకాలు సమృద్ధిగా ఉండటం వీటితో అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు.

పైన్ నట్స్
పైన్ నట్స్ (shutterstock)

చిల్గోజా, వీటినే ఆంగ్లంలో పైన్ నట్స్ అంటారు. రుచికరమైన గింజలంటే జీడిపప్పు, బాదాం, పిస్తాలే అనుకుంటాం. కానీ అంతకుమించిన మధురమైన రుచి ఈ పైన్ నట్స్‌కు ఉంటుంది. తినడానికి క్రీమీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఏదో మంచి స్వీట్ తిన్న అనుభూతి వస్తుంది. ఇంతకన్నా మంచి రుచి ఉన్న విత్తనం మరోటి లేదంటారు దీన్ని తిన్నవాళ్లు. చింతపండుకు ఎలాగైతే గోధుమరంగు తొడుగుంటుందో వీటికీ అలాగే. దాన్ని పగలకొడితే తెల్లటి గింజ బయటికొస్తుంది. అవే పైన్ నట్స్. రోజూ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల అనేక లాభాలుంటాయి. 

వీటి ధర ఊహించలేరు:

అనేక పోషకాలున్న పైన్ నట్స్ ధర మాత్రం చాలా ఎక్కువ. కిలోకు దాదాపుగా 8000 రూపాయల దాకా ఉంటుంది. అంటే ఓ గ్రాము బంగారం అనుకోండి. ఆరోగ్యం కోసం డబ్బు గురించి ఆలోచించక్కర్లేదు అనుకునేవాళ్లు మాత్రం వీటిని రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. డబ్బు అంత ఖర్చు పెట్టలేం అనుకుంటే మాత్రం కనీసం ఒక్కసారి 100 గ్రాముల గింజల్ని తెచ్చుకుని తప్పకుండా రుచి మాత్రం చూడండి. ఇంత ధర పెట్టేంతలా వీటిలో ఏముంటుందో తెలియాలంటే మొత్తం చదివేయండి.

చిల్గోజాలో పోషకాలు:

ఈ గింజల్లో 100 గ్రాములలో 673 కేలరీలు ఉంటాయి. మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల చిల్గోజా తినడం వల్ల 13.69 ప్రోటీన్లు లభిస్తాయి. అదే సమయంలో, చక్కెర పరిమాణం 3.59గ్రాముల్లో చాలా తక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా, 100 గ్రాముల చిల్గోజాలో 251 మి.గ్రా మెగ్నీషియం, 16 మి.గ్రా కాల్షియం, 597 గ్రాముల పొటాషియం ఉంటాయి. వీటితో పాటే ఫోలేట్, ఐరన్ అధికంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ 100 గ్రాముల చిల్గోజా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి.

గుండె ఆరోగ్యం:

చిల్గోజాలో 90 శాతం అసంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనివల్ల గుండె జబ్బు పడకుండా ఉంటుంది. చిల్గోజా ఇతర గింజల కంటే ఎక్కువ కొవ్వు ఆమ్లాలు కలిగి ఉంటుంది. ఈ కారణంగా ఇది గుండె ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు.

జంక్ ఫుడ్ తినాలనిపించదు:

వీటిని తినడం వల్ల కొవ్వులున్న జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఇవి తిన్నవెంటనే విడుదలయ్యే హార్మోన్లే దానికి కారణం. బరువు తగ్గాలని ఆలోచించే వ్యక్తులు చిల్గోజా తినడం ప్రారంభించాలి. అనారోగ్యకర ఆహారాలు తినాలనే కోరిక తగ్గించడంతో పాటూ బరువు తగ్గడంలోనూ ఇది సాయపడుతుంది.

క్యాన్సర్:

చిల్గోజాలో ఒమేగా 6, సెలీనియం ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.

సంతానోత్పత్తి:

సెలీనియం పరిమాణం సంతానోత్పత్తి సమస్యను తొలగిస్తుంది. చిల్గోజా పురుషుల్లో సెక్స్ శక్తిని పెంచుతుంది. చిల్గోజాలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది సంతానలేమి వంటి సమస్యను తొలగించడానికి సహాయపడుతుంది. రోజూ చిల్గోజా తినడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరగడంతో పాటు వీర్యకణాల నాణ్యత కూడా పెరుగుతుంది. అలాగే, చిల్గోజా ఉత్సాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

మరిన్ని ప్రయోజనాలు:

1. చిల్గోజా సాధారణ జలుబు నుండి రక్షించడానికి కూడా సహాయపడుతుంది. జింక్ పరిమాణం గాయం వేగంగా నయం చేయడానికి సహాయపడుతుంది.

2. డిప్రెషన్, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఉన్నవారు నిరాశ సమస్యతో పోరాడతారు. వీరు ఆహారంలో చిల్గోజా చేర్చుకోవాలి. మెగ్నీషియం మోతాదు ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే రాత్రిపూట చిల్గోజా తింటే కండరాలు రిలాక్స్ అవుతాయి.

3. మోనోపాజ్ తరువాత, మహిళల్లో ఎముక సాంద్రత తగ్గడం ప్రారంభమవుతుంది. అలాంటి మహిళలు తప్పనిసరిగా చిల్గోజా తినాలి. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చిల్గోజాలో ఉండే మెగ్నీషియం మొత్తం శరీరానికి కాల్షియం రవాణా చేయడానికి సహాయపడుతుంది.

4. పైన్ గింజల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువవ్వడం వల్ల డయాబెటిస్ లో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల ఇన్సులిన్ పనితీరు పెరుగుతుంది. చిల్గోజా తినడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

 

 

Whats_app_banner