తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Group 1 Hall Tickets 2024 : అభ్యర్థులకు అలర్ట్.. ఇవాళ తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల

TG Group 1 Hall Tickets 2024 : అభ్యర్థులకు అలర్ట్.. ఇవాళ తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల

01 June 2024, 5:32 IST

google News
    • TGPSC Group 1 Prelims Updates: ఇవాళ తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ గ్రూప్ -1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు
తెలంగాణ గ్రూప్ -1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు

తెలంగాణ గ్రూప్ -1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు

TGPSC Group 1 Prelims Hall Tickets 2024 : తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు సర్వం సిద్ధమవుతోంది. జూన్ 9వ తేదీన ఎగ్జామ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం టీఎస్పీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానున్నాయి.

నేటి నుంచి హాల్ టికెట్లు….

గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇవాళ్టి నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

How to Download TSPSC Group 1 Hall Tickets 2024 - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

  • తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా కమిషన్ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/  లోకి వెళ్లాలి.
  • TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్ - 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ ఓటీఆర్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అడ్మిట్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష….

తెలంగాణలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం కొద్దిరోజుల కిందట తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసి… మరికొన్ని పోస్టులను కలిపి ఈ ప్రకటన ఇచ్చింది. ఇందులో భాగంగా…. జూన్‌ 9న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనుంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుంది.

తెలంగాణ గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమైంది. మార్చి 14వ తేదీతోనే గడువు ముగిసింది. కానీ టీఎస్పీఎస్సీ మరో రెండు పొడిగించింది. దీంతో మార్చి 16వ తేదీతో అప్లికేషన్ల ప్రక్రియ ముగిసింది.ఈనోటిఫికేషన్ లో భాగంగా 563 ఉద్యోగాలను భర్తీ చేయనుంది టీఎస్పీఎస్సీ(TSPSC). అక్టోబరు 21వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది కమిషన్.

ఆఫ్ లైన్ పద్ధతిలోనే పరీక్ష…..

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను సీబీఆర్‌టీ విధానంలో కాకుండా…. ఓఎంఆర్‌(OMR) పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. గ్రూప్‌-1కు(Group 1 Preliminary Exam Applications) భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. 4.03 లక్షల అప్లికేషన్లు రావటంతో…. పరీక్షను ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలని కమిషన్ ఇటీవలేనే నిర్ణయం తీసుకుంది.

కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తే సాంకేతిక ఇబ్బందులు వస్తాయని అంచనా వేసింది. దీంతో… ఈసారి జరగబోయే ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్‌ బేస్డ్‌ ఆఫ్‌లైన్‌ విధానంలోనే నిర్వహించనున్నట్లు తెలిపింది.

TSPSC Group 1 Exam 2024: పరీక్షా విధానం:

గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థులు మొదటగా ప్రిలిమ్స్ రాయాలి. రెండో దశలో మెయిన్స్ ఉంటుంది.

1. ప్రిలిమినరీ ఎగ్జామ్‌

2. మెయిన్‌ ఎగ్జామినేషన్

ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తేనే మెయిన్స్ కు క్వాలిఫై అవుతారు. హాజరైన అభ్యర్థులను లెక్కలోకి తీసుకొని నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు పొందిన వారికి.. రెండో దశలో మెయిన్‌ ఎగ్జామినేషన్‌ ఉంటుంది.

ప్రిలిమినరీ పరీక్షను పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ విభాగాల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది.

ఇక 2వ దశలో నిర్వహించే మెయిన్స్ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. వీటికి 900 మార్కులు కేటాయించారు. ఈ 6 పేపర్లకు అదనంగా జనరల్‌ ఇంగ్లీష్‌ అర్హత పేపర్‌గా ఉంటుంది. ఈ పేపర్ ను 150 మార్కులకు నిర్వహిస్తారు. దీనికి 3 గంటల సమయం కేటాయిస్తారు.

NOTE : https://www.tspsc.gov.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులు ప్రిలిమ్స్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం