TS Inter Supply Exams 2024 : టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం - మే 24 నుంచి ఎగ్జామ్స్, షెడ్యూల్ ఇదే-telangana inter supplementary exams 2024 to start from 24 may ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Supply Exams 2024 : టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం - మే 24 నుంచి ఎగ్జామ్స్, షెడ్యూల్ ఇదే

TS Inter Supply Exams 2024 : టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం - మే 24 నుంచి ఎగ్జామ్స్, షెడ్యూల్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
May 23, 2024 10:08 PM IST

TS Inter Supplementary Exams 2024: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. మే 24వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

TS Inter Supplementary Exams 2024: మే 24వ తేదీ నుంచి తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరగనున్నాయి. ఇక సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబందించిన హాల్ టికెట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.

TS Inter Supply Exam schedule 2024 - ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్…

  • 24-05-2024 : Part II - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
  • 25-05-2024 : Part I -ఇంగ్లిష్ పేపర్-1
  • 28-05-2024 : Part -III -గణితం పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
  • 29-05-2024 : గణితం పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
  • 30-05-2024 : ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
  • 31-05-2024 : కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
  • 01-06-2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-1(For BiPC Students)
  • 03-06-2024 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1

TS Inter Supply Exam schedule 2024 - ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్…

  • 24-05-2024 : Part II - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
  • 25-05-2024 : Part I -ఇంగ్లిష్ పేపర్-2
  • 28-05-2024 : Part -III -గణితం పేపర్-2A, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
  • 29-05-2024 : గణితం పేపర్-2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
  • 30-05-2024 : ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
  • 31-05-2024 : కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2
  • 01-06-2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-2(For BiPC Students)
  • 03-06-2024 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2

TS Inter Supplementary Hall Tickets 2024 Download - డౌన్లోడ్ లింక్ ఇదే

  • ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలనే విద్యార్థులు https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మే/జూన్ - 2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • రోల్ నంబర్ లేదా మునుపటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఇక నిమిషం నిబంధనను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఐదు నిమిషాలపాటు ఆలస్యంగా వచ్చినప్పటికీ అభ్యర్థులను ఎగ్జామ్ హాల్ లోకి అనుమతిస్తారు. అయితే అభ్యర్థులు గందరగోళానికి గురి కాకుండా ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో సూచించారు.

సంబంధిత కథనం