TG ITI Admissions 2024 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్... ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే-ts iti trade 2024 admission notification released direct link here to apply ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Iti Admissions 2024 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్... ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

TG ITI Admissions 2024 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్... ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
May 19, 2024 01:19 PM IST

Telangana ITI Admissions 2024 : తెలంగాణలోని ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణ ఐటీఐ ప్రవేశాలు
తెలంగాణ ఐటీఐ ప్రవేశాలు (image source https://iti.telangana.gov.in/)

Telangana ITI Admissions 2024 : తెలంగాణలో ఈ ఏడాదికి సంబంధించిన ఐటీఐ ట్రేడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర ఉపాధి- శిక్షణ కమిషనర్‌ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2024-25 సెషన్‌కు గాను ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. జూన్‌ 10వ తేదీలోగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. https://iti.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు.

ఐటీఐ ప్రవేశాల ముఖ్య వివరాలు:

  • ప్రవేశాల ప్రకటన - ఉపాధి- శిక్షణ కమిషనర్‌ కార్యాలయం, తెలంగాణ రాష్ట్రం
  • కోర్సులు - ఐటీఐ కోర్సు (2024-25)
  • అర్హతలు - పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్నింటినికి 8వ తరగతిని విద్యా అర్హతగా నిర్ణయించారు.
  • ట్రేడ్ - ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్, కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మ్యాన్
  • వయోపరిమితి - 14 ఏళ్లు నిండి ఉండాలి.
  • సీట్ల కేటాయింపు - అకడమిక్ మెరిట్ తో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లో
  • దరఖాస్తులు రుసుం - రూ. 100 చెల్లించాలి.
  • దరఖాస్తులు ప్రారంభం - 16 మే , 2024
  • దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - 10 జూన్ , 2024.
  • ఆన్ లైన్ దరఖాస్తులో వివరాలను నమోదు చేసే సమయంలో ఎలాంటి తప్పులు చేయవద్దు. ముఖ్యంగా సరైన మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  • అధికారిక వెబ్ సైట్ - https://iti.telangana.gov.in/
  • దరఖాస్తు ఫారమ్ లింక్ - https://tsiti.ucanapply.com/

ఏపీలో ఐటీఐ ప్రవేశాలు…

AP ITI Admissions 2024 Notification: ఏపీలోని ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఈ మేరకు ఏపీ ఉపాధి- శిక్షణ కమిషనర్‌ కార్యాలయం వివరాలను పేర్కొంది. 2024-2025 సెషన్‌కు గాను ప్రభుత్వ/ ప్రైవేట్ ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో ప్రవేశాలను కల్పించనుంది.

ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 10వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. పదో తరగతిలో పాస్ అయిన విద్యార్థులు ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం అప్లయ్ చేసుకోవచ్చు. https://iti.ap.gov.in/ వెబ్ సైట్లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

ఏపీ ఐటీఐ కోర్సుల ముఖ్య వివరాలు :

  • ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాల ప్రకటన - ఏపీ ఉపాధి- శిక్షణ కమిషనర్‌ కార్యాలయం, విజయవాడ
  • అర్హతలు - పదో తరగతిలో ఉతీర్ణత సాధించాలి.
  • ట్రేడ్ కోర్సులు - ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్,కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మ్యాన్
  • వయసు - 14 ఏళ్లు నిండి ఉండాలి.
  • దరఖాస్తు విధానం -ఆన్ లైన్ లో వివరాలను నమోదు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ ను ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో సమర్పించాలి. వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • ఎంపిక విధానం - పదో తరగతిలో సాధించిన మార్కలను చూస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది.
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసే క్రమంలో ఎటువంటి తప్పులు లేకుండా చేయాలి.
  • పూర్తి చేసిన దరఖాస్తులను, ఒరిజినల్‌ సర్టిఫికేట్లను దగ్గరలోని ప్రభుత్వ ఐటీఐలో పరిశీలన చేయించుకొని ఆయా ప్రిన్సిపల్స్‌తో అటెస్టేషన్చే యించుకోవాల్సి ఉంటుంది.
  • దరఖాస్తులు ప్రారంభం - మే 09, 2024.
  • దరఖాస్తులకు చివరి తేదీ - జూన్ 063, 2024.
  • ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ లింక్ - https://itiadmissions.ap.gov.in/iti/open_application_entry.jsp
  • అధికారిక వెబ్ సైట్ - https://iti.ap.gov.in/

టీ20 వరల్డ్ కప్ 2024