AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?-ap iti admission notification 2024 released check the key dates are here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Iti Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

Maheshwaram Mahendra Chary HT Telugu
May 16, 2024 05:56 PM IST

AP ITI Admissions 2024 Updates : ఏపీలో ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా… జూన్ 10 తేదీతో ఈ ప్రాసెస్ ముగియనుంది.

ఏపీ ఐటీఐ అడ్మిషన్లు 2024
ఏపీ ఐటీఐ అడ్మిషన్లు 2024 (Image Source https://iti.ap.gov.in/)

AP ITI Admissions 2024 Notification: ఏపీలోని ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఈ మేరకు ఏపీ ఉపాధి- శిక్షణ కమిషనర్‌ కార్యాలయం వివరాలను పేర్కొంది. 2024-2025 సెషన్‌కు గాను  ప్రభుత్వ/ ప్రైవేట్ ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో ప్రవేశాలను కల్పించనుంది.

ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 10వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. పదో తరగతిలో పాస్ అయిన విద్యార్థులు ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం అప్లయ్ చేసుకోవచ్చు. https://iti.ap.gov.in/ వెబ్ సైట్లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.  

ముఖ్య వివరాలు :

  • ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాల ప్రకటన - ఏపీ ఉపాధి- శిక్షణ కమిషనర్‌ కార్యాలయం, విజయవాడ
  • అర్హతలు - పదో తరగతిలో ఉతీర్ణత సాధించాలి. 
  • ట్రేడ్ కోర్సులు - ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్,కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మ్యాన్
  • వయసు - 14 ఏళ్లు నిండి ఉండాలి. 
  • దరఖాస్తు విధానం -ఆన్ లైన్ లో వివరాలను నమోదు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ ను ప్రభుత్వ ఐటీఐ కాలేజీల్లో సమర్పించాలి.  వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • ఎంపిక విధానం - పదో తరగతిలో సాధించిన మార్కలను చూస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది.
  •  ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసే క్రమంలో ఎటువంటి తప్పులు లేకుండా చేయాలి. 
  • పూర్తి చేసిన దరఖాస్తులను, ఒరిజినల్‌ సర్టిఫికేట్లను దగ్గరలోని ప్రభుత్వ ఐటీఐలో పరిశీలన చేయించుకొని ఆయా ప్రిన్సిపల్స్‌తో అటెస్టేషన్చే యించుకోవాల్సి ఉంటుంది. 
  • దరఖాస్తులు ప్రారంభం - మే 09, 2024.
  • దరఖాస్తులకు చివరి తేదీ - జూన్ 063, 2024.
  • ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ లింక్ - https://itiadmissions.ap.gov.in/iti/open_application_entry.jsp 
  • అధికారిక వెబ్ సైట్ - https://iti.ap.gov.in/ 

 

Whats_app_banner