RRB ALP Recruitment 2024: రైల్వేలో భారీ రిక్రూట్మెంట్; 5 వేల కు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ ల భర్తీ; విద్యార్హత ఐటీఐ..-rrb alp recruitment 2024 registration for 5696 posts begins on january 20 details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rrb Alp Recruitment 2024: రైల్వేలో భారీ రిక్రూట్మెంట్; 5 వేల కు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ ల భర్తీ; విద్యార్హత ఐటీఐ..

RRB ALP Recruitment 2024: రైల్వేలో భారీ రిక్రూట్మెంట్; 5 వేల కు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ ల భర్తీ; విద్యార్హత ఐటీఐ..

HT Telugu Desk HT Telugu
Jan 19, 2024 08:59 PM IST

RRB ALP Recruitment 2024: భారీ రిక్రూట్మెంట్ కు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) తెర లేపింది. మొత్తం 5696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్ లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Rajkumar)

RRB ALP Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే విభాగంలో 5 వేలకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్ లను భర్తీ చేయడానికి ఆర్ ఆర్ బీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

రేపటి నుంచి రిజిస్ట్రేషన్

రైల్వేలో 5696 అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant Loco Pilot) పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆర్ ఆర్ బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా జనవరి 20వ తేదీ నుంచి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

లాస్ట్ డేట్

ఈ పోస్ట్ లకు జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత సాధించి ఉండాలి. దాంతో పాటు, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మిల్‌రైట్/ మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ ట్రేడ్‌లలో గుర్తింపు పొందిన ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ సంస్థల నుండి ఐటిఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేదా మెట్రిక్యులేషన్ తో పాటు డిటైల్డ్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ట్రేడ్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.

డిప్లోమా కూడా

మెట్రిక్యులేషన్ తో పాటు మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసినవారు కూడా ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి అర్హులే. వారు మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. పూర్తి వివరాలకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ జనవరి 20-26 ఎడిషన్‌లో ప్రచురించే సమగ్ర నోటిఫికేషన్‌ ను పరిశీలించండి. మరింత సమాచారం కోసం, అభ్యర్థులు RRBల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

టీ20 వరల్డ్ కప్ 2024