ECIL Hyderabad Jobs 2024 : టెన్త్, ఐటీఐ అర్హతతో హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ లో ఉద్యోగాలు - ముఖ్య తేదీలివే-ecil hyderabad invites online applications for technician jobs 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ecil Hyderabad Jobs 2024 : టెన్త్, ఐటీఐ అర్హతతో హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ లో ఉద్యోగాలు - ముఖ్య తేదీలివే

ECIL Hyderabad Jobs 2024 : టెన్త్, ఐటీఐ అర్హతతో హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ లో ఉద్యోగాలు - ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 27, 2024 11:21 AM IST

ECIL Hyderabad Recruitment 2024: హైదరాబాద్ లోని ఈసీఐఎల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా టెక్నిషియన్ (గ్రేడ్ -2) పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. మార్చి 23వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

ఈసీఐఎల్ లో ఉద్యోగాలు 2024
ఈసీఐఎల్ లో ఉద్యోగాలు 2024

ECIL Hyderabad Recruitment 2024 : హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Electronics Corporation of India Limited) నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనలో భాగంగా….టెక్నిషియన్ (గ్రేడ్ -2) పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. మార్చి 23వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా…ఏప్రిల్ 13వ తేదీతో గడువు ముగియనుంది. హాల్ టికెట్లు, రాతపరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. https://www.ecil.co.in/jobs.html  వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన -ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL), హైదరాబాద్
  • ఉద్యోగాల పేరు - టెక్నిషియల్ (గ్రేడ్ 2)
  • మొత్తం ఖాళీలు, వివరాలు - 30
  1. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 07
  2. Electrician - 06
  3. మెకానిస్ట్ - 07
  4. ఫిట్టర్ - 10
  • అర్హతలు - పదో తరగతితో పాటు ఐటీఐలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి. పోస్టును బట్టి అర్హతలను నిర్ణయించారు.
  • వయోపరిమితి - 27 ఏళ్ల లోపు ఉండాలి.
  • రూల్ ఆఫ్ రిజర్వేషన్లను బట్టి తుది జాబితాను ప్రకటిస్తారు.
  • జీతం - రూ. 50 వేల నుంచి రూ.1,60,000.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్ లోనే అప్లై చేసుకోవాలి.
  • దరఖాస్తు రుసుం - రూ. 750 చెల్లించాలి.
  • దరఖాస్తులు ప్రారంభం - మార్చి 23, 2024.
  • దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - ఏప్రిల్ 13, 2024.
  • ఎంపిక విధానం - రాత పరీక్షలతో పాటు ట్రేడ్ టెస్టులు ఉంటాయి.
  • బేసిక్ పేగా నెలకు రూ.  20,480గా ఇస్తారు.
  • బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్ కత్తా, ఢిల్లీ, ముంబై సిటీల్లో పరీక్షలను నిర్వహిస్తారు.
  • అధికారిక వెబ్ సైట్ - https://www.ecil.co.in/home.html 
  • మెయిల్ అడ్రస్ -  jarait.j@ecil.co.in /madhaviaurorab@ecil.co.in

కింద ఇచ్చిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ లో అన్ని వివరాలను చూడొచ్చు….

IPL_Entry_Point