AP Open SSC Inter Hall Tickets : ఏపీ ఓపెన్ టెన్త్, ఇంటర్ హాల్ టికెట్లు విడుదల- ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!-amaravati news in telugu ap open ssc intermediate hall tickets released download process here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Open Ssc Inter Hall Tickets : ఏపీ ఓపెన్ టెన్త్, ఇంటర్ హాల్ టికెట్లు విడుదల- ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

AP Open SSC Inter Hall Tickets : ఏపీ ఓపెన్ టెన్త్, ఇంటర్ హాల్ టికెట్లు విడుదల- ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

Bandaru Satyaprasad HT Telugu
Mar 11, 2024 09:48 PM IST

AP Open SSC Inter Hall Tickets : ఏపీ ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఓపెన్ టెన్త్, ఇంటర్ హాల్ టికెట్లు
ఓపెన్ టెన్త్, ఇంటర్ హాల్ టికెట్లు

AP Open SSC Inter Hall Tickets : ఏపీ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు(AP Open SSC Inter Hall Tickets) విడుదలయ్యాయి. ఏపీ ఓపెన్ స్కూల్స్ సొసైటీ హాల్ టికెట్లనుhttps://apopenschool.ap.gov.in/ వెబ్ సైట్ లో విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకూ పరీక్షలు జరుగనున్నాయి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.

yearly horoscope entry point

ఏపీ ఓపెన్ టెన్త్, ఇంటర్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ ఇలా?

Step 1 : ఏపీ సార్వత్రిక విద్యాపీఠం అధికారిక వెబ్ సైట్ https://apopenschool.ap.gov.in/ పై క్లిక్ చేయండి.

Step 2 : హోమ్ పేజీలో ఏపీ ఎస్ఎస్సీ, ఇంటర్(APOSS) హాల్ టికెట్ల లింక్ పై క్లిక్ చేయండి

Step 3 : తర్వాతి పేజీలో పదో తరగతి, ఇంటర్ , ఇంటర్ ప్రాక్టికల్స్ హాల్ టికెట్ల లింక్ లు కనిపిస్తాయి.

Step 4 : విద్యార్థులు సంబంధిత లింక్ పై క్లిక్ చేసి జిల్లా, స్కూల్, విద్యార్థి పేరు ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

పదో తరగతి, ఇంటర్ పరీక్షలను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ నిర్వహించనున్నారు.

పదో తరగతి టైమ్ టేబుల్

  • మార్చి 18 - తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం
  • మార్చి 19-హిందీ
  • మార్చి 20-ఇంగ్లిష్
  • మార్చి 22-గణితం, భారతీయ సంస్కృతి వారసత్వం
  • మార్చి 23-శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, గృహ విజ్ఞాన శాస్త్రం
  • మార్చి 26- సాంఘిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం

ఇంటర్ పరీక్షల షెడ్యూల్

  • మార్చి 18 - హిందీ, తెలుగు , ఉర్దూ
  • మార్చి 19- జీవ శాస్త్రం, వాణిజ్య/వ్యాపార శాస్త్రం, గృహ విజ్ఞాన శాస్త్రం
  • మార్చి 20- ఇంగ్లిష్
  • మార్చి 22-గణితం
  • మార్చి 23- భౌతిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం/ పౌరశాస్త్రం, మనో విజ్ఞాన శాస్త్రం
  • మార్చి 26- రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఓపెన్‌ స్కూల్‌ టెన్త్, ఇంటర్‌ పరీక్షలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఏపీ రెగ్యులర్ టెన్త్ పరీక్షలు

ఏపీ రెగ్యులర్ పదో తరగతి(10th Class) వార్షిక పరీక్షలు మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్నాయి. పదో తరగతి హాల్ టికెట్లను(AP SSC Hall Tickets) ఇప్పటికే విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్ www.bse.ap.gov.in లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచింది. పాఠశాలల లాగిన్ తో పాటు విద్యార్థులు కూడా నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE-AP) పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌(AP SSC Exam Schedule) ప్రకటించిన సంగతి తెలిసిందే. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్‌ www.bse.ap.gov.in లో విద్యార్థులు హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ (AP SSC Hall Tickets Download)చేసుకుని, ప్రింటవుట్ తీసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం