IIT Tirupati Jobs 2024 : ఐఐటీ తిరుపతిలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు - అర్హతలు, ముఖ్య తేదీలివే
IIT Tirupati Recruitment 2024 Updates: తిరుపతి ఐఐటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా…ఏప్రిల్ 11వ తేదీతో గడువు ముగియనుంది.
IIT Tirupati Recruitment 2024: నాన్ టీచింగ్ ఖాళీల భర్తీ కోసం తిరుపతిలోని ఐఐటీ(IIT Tirupati Recruitment 2) నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం ఎనిమిది పోస్టులను భర్తీ చేయనున్నారు. మార్చి 12వ తేదీన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా… ఏప్రిల్ 11వ తేదీతో అప్లికేషన్ల గడువు ముగియనుంది. ఆన్ లైన్ లో దరఖాస్తుల చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టును బట్టి జీతభత్యాలను ఖరారు చేశారు. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి….
ముఖ్య వివరాలు:
ఉద్యోగ ప్రకటన - ఐఐటీ, తిరుపతి.
మొత్తం ఉద్యోగాలు - 08
ఖాళీల వివరాలు :
- జూనియర్ అసిస్టెంట్ - 03(Group C)
- స్టూడెంట్ కౌన్సెలర్ - 01(Group A)
- హిందీ ట్రాన్స్‌లేటర్ - 01(Group B)
- జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ - 1 ఉద్యోగం(Group B)
- జూనియర్ టెక్నీషియన్ - 02 పోస్టులు(Group C)
అర్హతలు - మాస్టర్ డిగ్రీ/ డిగ్రీ ఉండాలి. పోస్టులను బట్టి అర్హతలను నిర్ణయించారు. పని అనుభవం కూడా ఉండాలి. పూర్తి నోటిఫికేషన్ లో వివరాలను చూడొచ్చు.
గ్రూప్ ఏ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వూ ఉంటుంది.గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీకి అబ్జెక్టివ్ బేస్ టెస్ట్, రాత పరీక్ష, స్కిల్ పరీక్ష ఉంటుంది.
దరఖాస్తుల విధానం - ఆన్ లైన్
దరఖాస్తులు ప్రారంభం - మార్చి 12, 2024
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - 11 ఏప్రిల్, 2024.
అధికారిక వెబ్ సైట్ - https://iittp.ac.in/
అప్లికేషన్ లింక్ - https://iittp.plumerp.co.in/prod/iittirupati/staffrecruitment
ఐఐటీ తిరుపతిలో ప్రవేశాలు….
IIT Tirupathi Admissions: తిరుపతిలోని ఐఐటీ క్యాంపస్‌లో పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. పలు విభాగాల్లో పిహెచ్‌డి Phd ప్రవేశాలతో పాటు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఐఐటీ తిరుపతి క్యాంపస్‌లో ఇంజనీరింగ్, సైన్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ Social Science విభాగాల్లో పిహెచ్‌డి ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పీజీ (PG) కోర్సుల్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ఇన్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.ఐఐటీలో ఎంటెక్ Mtech ప్రవేశాల కోసం కూడా దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైంది. మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ కోర్సులో కూడా అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. మాస్టర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్, పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 13నుంచి ప్రారంభించారు. ఏప్రిల్ 10వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంటెక్, మాస్టర్ ఆఫ పబ్లిక్ పాలసీ కోర్సులకు మార్చి 20వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మరిన్ని వివరాలు www.iittp.ac.in/admissions లో అందుబాటులో ఉంటాయి.