తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eamcet 2023 Exam Date: విద్యార్థులకు అలర్ట్… ఎంసెట్ పరీక్ష తేదీలు మార్పు

TS EAMCET 2023 exam date: విద్యార్థులకు అలర్ట్… ఎంసెట్ పరీక్ష తేదీలు మార్పు

HT Telugu Desk HT Telugu

21 April 2023, 10:33 IST

google News
    • TS EAMCET 2023 exam date: తెలంగాణ ఎంసెట్ విద్యార్థులకు కీలక అప్టేట్ ఇచ్చారు అధికారులు. ఎంసెట్ పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేశారు. 
ఎంసెట్ ఎగ్జామ్స్ తేదీలు మార్పు
ఎంసెట్ ఎగ్జామ్స్ తేదీలు మార్పు

ఎంసెట్ ఎగ్జామ్స్ తేదీలు మార్పు

TS EAMCET 2023 Exam Dates: తెలంగాణ ఎంసెట్ 2023 పరీక్ష తేదీలు మారాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. నీట్, టీఎస్పీఎస్సీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు మే 7 నుంచి 11 వరకు జరగాల్సి ఉంది. అయితే మారిన షెడ్యూల్ ప్రకారం మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా. ఎన్. శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు.

మే 7న నీట్ (యూజీ) పరీక్ష, మే 7, 8, 9 తేదీల్లో టీఎస్పీఎస్సీ పరీక్షలు ఉండటంతో ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. మే 10, 11 తేదీల్లోనే ఈ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎంసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

ముఖ్య వివరాలు:

ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల.

మార్చి 3 నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ స్వీకరణ.

ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరణకి చివరి తేదీ ఏప్రిల్ 10.

ఏప్రిల్ 12 నుండి 14 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం.

ఏప్రిల్ 30 నుండి ఆన్లైన్ లో ఎంసెట్ హల్ టికెట్స్ జారీ.

మే 29 నుండి జూన్ 1 వరకు ఎంసెట్ పరీక్షలు (TS EAMCET 2023 exam date)

మే 12,13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు.

మే 10,11న అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షలు.

ఉదయం 9 నుండి 12 వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 నుండి 6 వరకు రెండవ సెషన్ పరీక్ష ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 500 రూపాయలు.

ఇతర విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 900 రూపాయలు.

ఈసారి ఎంసెట్ ద్వారా నే బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్

ఈసారి ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ లేదు.

తదుపరి వ్యాసం