TSPSC: ఏఈఈ పరీక్ష తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ-tspsc announced aee exam dates check full details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc: ఏఈఈ పరీక్ష తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ

TSPSC: ఏఈఈ పరీక్ష తేదీలు ప్రకటించిన టీఎస్పీఎస్సీ

HT Telugu Desk HT Telugu
Mar 29, 2023 09:05 PM IST

TSPSC Latest Updates: అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది టీఎస్పీఎస్సీ. ర‌ద్దు చేసిన ఏఈఈ( AEE ) నియామ‌క ప‌రీక్ష‌ల తేదీల‌ను ప్రకటించింది.

ఏఈఈ నియామ‌క ప‌రీక్ష‌ల తేదీలు విడుదల
ఏఈఈ నియామ‌క ప‌రీక్ష‌ల తేదీలు విడుదల

TSPSC AEE Exam Dates: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక అంశాలు విషయాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు.... మరిన్ని విషయాలను బయటికి లాగే పనిలో పడింది. ఇదిలా ఉంటే మరోవైపు పరీక్షలకు సంబంధించి కొత్త తేదీలపై కసరత్తు చేస్తోంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇదే సమయంలో రద్దు అయిన ఏఈఈ పరీక్ష తేదీని ప్రకటించింది టీఎస్పీఎస్సీ. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

కొత్త తేదీలివే…

పేపర్ లీకేజీ కారణంగా గతంలో రద్దు చేసిన ఏఈఈ పరీక్షల తేదీలను ప్రకటించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. మే 8న ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్సానిక్స్ ఇంజినీరింగ్, 9న అగ్రికల్చర్ ఇంజనీరింగ్, 21న సివిల్ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనుంది. గతంలో జనవరి 22న ఏఈఈ పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే.. పేపర్ లీకేజీ అయినట్లు నిర్ధారణ కావడంతో ఈ పరీక్షలను రద్దు అయ్యాయి.

మరోవైపు ఏప్రిల్ 4వ తేదీన జరగాల్సిన హార్టికల్చర్‌ ఆఫీసర్‌ నియామక పరీక్షను రీషెడ్యూల్ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తిరిగి ఈ పరీక్షను జూన్‌ 17వ తేదీన నిర్వహిస్తామని వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 22 హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేస్తారు. పేపర్-లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పై ప్రశ్నలుంటాయి. పేపర్-2 లో హార్టికల్చర్ విభాగంలో ప్రశ్నలుంటాయి.

త్వరలోనే మరిన్ని తేదీలు...

రాష్ట్రంలో ప్రశ్నపత్రాల లీకేజీ కేసు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ లీకేజీ కారణంగా ఇప్పటికే పలు పరీక్షలను రద్దు చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరికొన్నింటిని వాయిదా వేసింది. ఇప్పటికే నిర్ణయించిన పరీక్షల తేదీలను కూడా రీ-షెడ్యూల్‌ చేసే పనిలో పడింది.

ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో నాలుగు నోటిఫికేషన్ల పరీక్షలను కమిషన్‌ రద్దు చేసింది. మరో రెండింటిని వాయిదా వేసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీతో పాటు డివిజనల్‌ అకౌంట్స్‌ అధికారి-డీఏవో, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌-ఏఈఈ, అసిస్టెంట్‌ ఇంజినీర్‌-ఏఈ పరీక్షలు రద్దు అయ్యాయి. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌-టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి.

Whats_app_banner

సంబంధిత కథనం